తోటపల్లిలో హైకోర్టు న్యాయమూర్తి పూజలు
ABN , Publish Date - Dec 25 , 2025 | 10:34 PM
చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి శ్రీవెంకటేశ్వ ర, కోదండరామస్వామి దేవస్థానాలను గురువారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్‌కు సందర్శించారు.
గరుగుబిల్లి, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి శ్రీవెంకటేశ్వ ర, కోదండరామస్వామి దేవస్థానాలను గురువారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్‌కు సందర్శించారు. ఆయనకు పూర్ణకలశంతో దేవస్థానం చైర్మన్ ఎం.పకీరునాయుడు, ఈవో బి.శ్రీనివాస్ స్వాగతం పలికారు. అనంతరం వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. స్వామివారి చిత్రపటాన్ని ఆయనకు అందించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలో తోటపల్లికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు. గతంలో కంటే ప్రస్తుతం దేవస్థానం రూపురేఖలు మారాయన్నారు. దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. దేవస్థానం అభివృద్ధి కోసం ట్రస్ట్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన డాక్టర్ డి.పారినాయుడుతో పాటు పలువురిని అభినందించారు. ప్రభుత్వం తోటపల్లి అభివృద్ధికి సహకరిస్తే ఉత్తరాంధ్రకు ప్రత్యేక గుర్తింపు సంతరించుకుంటుందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రిన్సిపల్ న్యాయాధికారి ఎం.బబిత, జిల్లా అదనపు న్యాయాధికారి ఎస్.దామోదరం, పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు, ఎంపీటీసీ సభ్యుడు ఎం.సింహాచలంనాయుడు, రెవెన్యూ అధికారి ఎం.రాజేంద్ర, అభివృద్ధి సేవా ట్రస్టు ప్రతినిధి ఎం.వాసుదేవరావునాయుడు, రెడ్‌క్రాస్ సంస్థ చైర్మన్ మంచిపల్లి శ్రీరాములు, చుక్క భాస్కరరావు, ప్రధాన అర్చకులు వీవీ అప్పలాచార్యులు, పలువురు న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు.
ముక్కోటి ఏకాదశికి ఏర్పాట్లు
తోటపల్లిలోని కోదండరామస్వామి దేవస్థానం ముక్కోటి ఏకాదశికి ముస్తాబవుతోంది. ఈ నెల 30న ముక్కోటి (వైకుంఠ) ఏకాదశిని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్ధం అవసరమైన ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి బి.శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు రానున్నట్లు తెలిపారు. వారికి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. ముక్కోటి ఏకాదశి రోజున ఉదయం 8 గంటలకు దేవస్థానం నుంచి స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక పల్లకిపై తిరువీధి మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాలని కోరారు.