High Court Judge సొంతూరుకు హైకోర్టు న్యాయమూర్తి
ABN , Publish Date - Aug 16 , 2025 | 11:25 PM
High Court Judge from Native Village హైకోర్టు న్యాయమూర్తిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ గేదెల తుహిన్‌కుమార్ శనివారం తన స్వగ్రామం కత్తులకవిటికి వచ్చారు. దీంతో గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు.
ఆనందంలో కత్తులకవిటి గ్రామస్థులు
వీరఘట్టం, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): హైకోర్టు న్యాయమూర్తిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ గేదెల తుహిన్‌కుమార్ శనివారం తన స్వగ్రామం కత్తులకవిటికి వచ్చారు. దీంతో గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. వేద మంత్రాలు చదివి.. బాణసంచా కాల్చి.. పూలు జల్లి ఊరేగింపుగా గ్రామంలోకి తీసుకొచ్చారు. తొలుత ఆయన దుర్గాదేవి గుడి, రామాలయాన్ని సంద ర్శించారు. సతీమణి ప్రమీలతో కలిసి ప్రతేక పూజలు చేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. వంగర, వీరఘట్టం, పాలకొండ మండలాల నుంచి పెద్దఎత్తున ప్రజలు వచ్చి ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించారు. ఆ తర్వాత జస్టిస్ తుహిన్‌కుమార్ గ్రామస్థులను పేరుపేరునా పలకరించారు. ఎంతో ఆప్యాయంగా మాట్లాడి.. కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. ఉన్నత స్థాయికి చేరినా తమను మరిచిపోలేదని, ఎంతో ఆనందంగా ఉందని ఆ గ్రామస్థులు తెలిపారు. జస్టిస్ తుహిన్‌కుమార్‌ను పాలకొండ న్యాయాధికారి హరిప్రియ, పార్వతీపురానికి చెందిన ప్రముఖ వైద్యుడు డి.రామ్మోహన్‌రావు, మాజీ ఎమ్మెల్సీ జగదీష్, ఎమ్మెల్సీ విక్రాంత్, వంగర తహసీల్దార్ సాయి కామేశ్వరరావు తదితరులు కలిశారు.