Share News

విజయనగరంలో భారీ వర్షం

ABN , Publish Date - Jun 01 , 2025 | 12:08 AM

విజయనగరంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని రోడ్లన్నీ జలమయమ య్యాయి. రైల్వే ఆండర్‌ బ్రిడ్జి, సిటి బస్టాండ్‌ తదితర ప్రాంతాల్లో నడుమ లోతులో నీరునిలిచిపోయింది. దీంతో వాహన చోదకులు రాకపోకలకు ఇబ్బంది పడ్డారు.

విజయనగరంలో భారీ వర్షం
విజయనగరం కలెక్టరేట్‌: రైల్వే బ్రిడ్జి వద్ద నడుము లోతు నీరుచేరిన దృశ్యం::

విజయనగరం కలెక్టరేట్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): విజయనగరంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని రోడ్లన్నీ జలమయమ య్యాయి. రైల్వే ఆండర్‌ బ్రిడ్జి, సిటి బస్టాండ్‌ తదితర ప్రాంతాల్లో నడుమ లోతులో నీరునిలిచిపోయింది. దీంతో వాహన చోదకులు రాకపోకలకు ఇబ్బంది పడ్డారు.

ఫ వేపాడ, మే 31 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాల్లో శుక్ర, శని వారాల్లో కురిసిన భారీ వర్షాలకు నువ్వు పంట పొలాల్లో నీరు చేరింది. పలుచోట్ల ఎగువన ఉన్న పొలాల నుంచి వరద రావడంతో పంట నీట మునిగి పోయాయి. నీరు ఎక్కువ రోజులు నిల్వఉంటే పంట కుళ్లిపోతుందని రైతులు ఆందోళన చెం దుతున్నారు. వర్షం నీరు బయటకు వెళ్లేలా రైతులు కాలువలు తీసినా ప్రయోజనం లేకుండాపోయింది.మరో పది పదిహేను రోజుల్లో చేతికి పంట వస్తుందన్న సమ యంలో కురిసిన వర్షంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Jun 01 , 2025 | 12:08 AM