Share News

Healthy Lifestyle ఆరోగ్యకరమైన జీవన శైలితో వ్యాధులు దూరం

ABN , Publish Date - Sep 26 , 2025 | 11:27 PM

Healthy Lifestyle Keeps Diseases Away ఆరోగ్యకరమైన జీవన శైలితో వ్యాధులను దూరం చేసుకోవచ్చని డీఎంహెచ్‌వో ఎస్‌.భాస్కరరావు తెలిపారు. శుక్రవారం పెదభోగిలిలో నిర్వహించిన ‘స్వస్థ్‌ నారీ సశక్త్‌ పరివార్‌ అభియాన్‌’ వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ముందుగా ఎంతమంది వైద్య సేవలు వినియోగించుకున్నారో తెలుసుకున్నారు.

Healthy Lifestyle  ఆరోగ్యకరమైన జీవన శైలితో వ్యాధులు దూరం
ప్రజలకు అవగాహన కల్పిస్తున్న డీఎంహెచ్‌వో

సీతానగరం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యకరమైన జీవన శైలితో వ్యాధులను దూరం చేసుకోవచ్చని డీఎంహెచ్‌వో ఎస్‌.భాస్కరరావు తెలిపారు. శుక్రవారం పెదభోగిలిలో నిర్వహించిన ‘స్వస్థ్‌ నారీ సశక్త్‌ పరివార్‌ అభియాన్‌’ వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ముందుగా ఎంతమంది వైద్య సేవలు వినియోగించుకున్నారో తెలుసుకున్నారు. ఈ కార్యక్రమ వివరాలు ఆన్‌లైన్‌ నమోదుపై సిబ్బందిని ప్రశ్నించారు. వచ్చేనెల 2 వరకు కొనసాగనున్న ప్రత్యేక వైద్య శిబిరాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించాలని వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. సరైన జీవన శైలి, ఆహార నియమావళి , వ్యాయామం, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత ప్లాస్టిక్‌ వినియోగంతో కలిగే అనర్థాలు, సురక్షిత నీరు తదితర వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి టి.జగన్మోహనరావు, వైద్యురాలు ఉషారాణి, సీహెచ్‌వో రమణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 26 , 2025 | 11:27 PM