Health Surveys పారదర్శకంగా ఆరోగ్య సర్వేలు చేపట్టాలి
ABN , Publish Date - Dec 03 , 2025 | 12:04 AM
Health Surveys Must Be Conducted Transparently ఆరోగ్య సర్వేలు పారదర్శకంగా నిర్వహించాలని డీఎంహెచ్‌వో భాస్కరరావు ఆదేశించారు. వ్యాధి లక్షణాలు స్పష్టంగా గుర్తించాలన్నారు. మంగళ వారం ప్రోగ్రాం అధికారులతో కలిసి భామిని పీహెచ్‌సీని ఆకస్మికంగా సందర్శించారు. ఆసుప త్రిలో సేవలు, మందులు, వైద్య పరీక్షలపై ఆరా తీశారు.
భామిని, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ఆరోగ్య సర్వేలు పారదర్శకంగా నిర్వహించాలని డీఎంహెచ్‌వో భాస్కరరావు ఆదేశించారు. వ్యాధి లక్షణాలు స్పష్టంగా గుర్తించాలన్నారు. మంగళ వారం ప్రోగ్రాం అధికారులతో కలిసి భామిని పీహెచ్‌సీని ఆకస్మికంగా సందర్శించారు. ఆసుప త్రిలో సేవలు, మందులు, వైద్య పరీక్షలపై ఆరా తీశారు. అనంతరం ఆశాడే కార్యక్రమంలో పాల్గొని గ్రామీణ వైద్య సేవలపై సమీక్షించారు. మాతా, శిశు ఆరోగ్య సేవలపై ప్రత్యేక దృష్టిసారించి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. నిరంతరం పర్యవేక్షించాలని , అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అన్ని వేళలా రోగులకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో విజయపార్వతి, జిల్లా ఆర్‌బీఎస్‌కే అధికారి టి.జగన్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
21న పల్స్‌పోలియో
పార్వతీపురం, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ నెల 21న జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌వో భాస్కరరావు సూచించారు. మంగళవారం స్థానిక ఎన్‌జీవో హోంలో వైద్యాధికారులు, ఆరోగ్య పర్యవేక్షకులకు రీ ఓరియెంటేషన్ శిక్షణ నిర్వహించారు. ఐదేళ్లలోపు పిల్లల జాబితా, మైక్రో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని డీఎంహెచ్‌వో ఆదేశించారు. సర్వేలెన్స్ వైద్యాధికారి జాన్ డీఐవో విజయ్‌మోహన్, ఆరోగ్యశాఖ జిల్లా ప్రోగ్రాం అధికారులు రఘుకుమార్, వినోద్‌కుమార్ తదితరులున్నారు.