పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం
ABN , Publish Date - Sep 25 , 2025 | 11:57 PM
పరిసరాల పరిశుభ్రతతోనే ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి అన్నారు.
- కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి
పార్వతీపురంటౌన్, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): పరిసరాల పరిశుభ్రతతోనే ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని కొత్తవలస నవదుర్గా కోనేరు వద్ద గురువారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించారు. కోనేరు పరిసరాల్లో ఉన్న చెత్తా చెదారం, గడ్డిని తొలగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పట్టణాలు, గ్రామాల్లో జీవిస్తున్న ప్రతిఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను పాటించి ఆరోగ్యంగా జీవించాలని అన్నారు. విద్యావంతులు, మేధావులు పర్యావరణ పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అక్టోబరు 2వరకు జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం నిర్వహించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని అన్నారు. మునిసిపల్ చైర్‌పర్సన్ బి.గౌరీశ్వరీ, కమిషనర్ శ్రీనివాసరాజు, తదితరులు పాల్గొన్నారు.
లేఅవుట్ స్థలాల ఆక్రమణపై ఫిర్యాదు
పట్టణ సమీపంలోని కొత్తవలస పరిధిలో ఉన్న జగనన్న లేఅవుట్ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయని స్థానికులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ అవుట్‌లో 16 మంది పేదలకు స్థలాలు కేటాయించారని, కొంతమంది పెద్దలు వాటిని ఆక్రమించుకున్నారని వారు చెప్పారు. 12 మంది అన్హరులు ఇక్కడ కట్టడాలు నిర్మించినట్లు గతంలో అధికారులు గుర్తించినట్లు కలెక్టర్‌కు తెలిపారు. ఇలా వదిలేస్తే ఆయా స్థలాలు అక్రమణకు గురవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.