Share News

కత్తితో పీక కోసుకుని..

ABN , Publish Date - Dec 17 , 2025 | 12:11 AM

క్షణికావేశంతో ఓ గిరిజన యువకుడు కత్తితో పీక కోసుకొని ప్రాణం తీసుకున్న ఘటన చాకలిగూడ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.

కత్తితో పీక కోసుకుని..
ప్రేమ్‌కుమార్‌(ఫైల్‌)

- తాతతో గొడవపడిన యువకుడు

- క్షణికావేశంతో బలవన్మరణం

సీతంపేట రూరల్‌, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): క్షణికావేశంతో ఓ గిరిజన యువకుడు కత్తితో పీక కోసుకొని ప్రాణం తీసుకున్న ఘటన చాకలిగూడ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. సీతంపేట ఎస్‌ఐ వై.అమ్మనరావు వివరాల మేరకు.. చాకలిగూడకు చెందిన సవర ప్రేమ్‌కుమార్‌(23) అనే యువకుడి తల్లిదండ్రులు పదేళ్ల కిందట అనారోగ్యంతో మృతిచెందారు. దీంతో ప్రేమ్‌కుమార్‌ తన తాత, నాన్నమ్మలైన సవర గోపాలం, చుక్కమ్మ, అన్నయ్య శాంతికుమార్‌, వదినతో కలిసి జీవిస్తున్నాడు. మంగళవారం ఉదయం ఇంట్లో నిద్రిస్తున్న ప్రేమ్‌కుమార్‌ను కొండపోడు వ్యవసాయ పనులకు వెళ్దామని తాత గోపాలం పిలిచాడు. ప్రేమ్‌కుమార్‌ రానని చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య మాటమాట పెరిగింది. క్షణికావేశానికి గురైన ప్రేమ్‌కుమార్‌ కొండపోడు పనుల కోసం తాత తీసుకువెళ్తున్న కత్తితో పీక కోసుకున్నాడు. వెంటనే ఆయన్ను కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ప్రేమ్‌కుమార్‌ను ఆటోలో పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. దీనిపై ఎస్‌ఐ అమ్మనరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Dec 17 , 2025 | 12:11 AM