భార్య కళ్లెదుటే నదిలోకి దూకేశాడు
ABN , Publish Date - Oct 07 , 2025 | 11:55 PM
మండలంలోని బుషిం గి వంతెనపై నుంచి నాగావళి నదిలోకి మంగళవారం సాయంత్రం ఓ యువకుడు భార్య కళ్లెదుటే దూకి గల్లం తయ్యాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. వీరఘ ట్టం మండలంలోని బీటీవాడకు చెందిన కల్లేపల్లి జగదీష్ చేపల వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. నిత్యం వంగర మండలంలోని మగ్గూరు వద్ద చేపలు కొనుగోలు చేసి విక్రయిస్తుంటారు.
వంగర అక్టోబరు7(ఆంధ్రజ్యోతి): మండలంలోని బుషిం గి వంతెనపై నుంచి నాగావళి నదిలోకి మంగళవారం సాయంత్రం ఓ యువకుడు భార్య కళ్లెదుటే దూకి గల్లం తయ్యాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. వీరఘ ట్టం మండలంలోని బీటీవాడకు చెందిన కల్లేపల్లి జగదీష్ చేపల వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. నిత్యం వంగర మండలంలోని మగ్గూరు వద్ద చేపలు కొనుగోలు చేసి విక్రయిస్తుంటారు. ఎప్పటిలాగే చేపలు విక్రయించి భార్యాభర్తలు మోటారు సైకిల్‌పై వస్తున్నారు. రుషింగి వంతెనపైకి రాగానే వాహనం పక్కన నిలిపివేశాడు. భార్య పార్వతీని వాహనంనుంచి కిందకి దింపి ఆమె కళ్లెదుటే నదిలో దూకేశాడు. దీంతో భార్య పార్వతీ కేకలు వేయడంతో సమీపంలోని కొందరు అక్కడకు చేరుకున్నారు. ఆ సమయంలో వర్షం కురుస్తుండడంతో అక్కడకు చేరుకున్న వారు ఏమీచేయలేకపోయారు. గ్రామస్థుల సమాచారం మేరకు వంగర పోలీ సులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. జగదీష్ వివరాలు ఆయన భార్యనుంచి సేకరించారు.నిత్యం అన్యోన్యంగాఉంటూ గరుగుబిల్లి మం డలంలోని రాయివలస కేంద్రంగా చేపలవ్యాపారం చేసుకునే వారని, సాయం త్రం మగ్గూరు చేరుకుని వేకువజామున లేచి చేపలు మడ్డువలస రేవులో కొనుగోలు చేసేవారని పలువురు తెలిపారు. అయితే జగదీష్ ఇటీవల దుర్గా మాలధారణ చేసి విరమించాడు. తర్వాత మద్యం సేవించడంతో భార్య నిల దీయడం వల్ల నదిలో దూకినట్లు చెబుతున్నారు. కళ్లెదుటే భర్త గల్లంతుకావ డంతో పార్వతీ రోదిస్తోంది.