Share News

Hawks on the ridge గెడ్డవాగుపై గద్దలు

ABN , Publish Date - Jul 17 , 2025 | 11:54 PM

Hawks on the ridge నగర శివార్లలోని విజయనగరం నుంచి జమ్ము నారాయణపురం వెళ్లే దారిలో సర్వే నెంబరు 148/1( రెవెన్యూ రికార్డుల ప్రకారం)లో ఉన్న వాగుపై కబ్జాదారులు మరోసారి కన్నేశారు. ఈసారి ఎలాగైనా ఆక్రమించి అమ్మేయాలని చూస్తున్నారు. అందుకు నేతలను రంగంలోకి దించే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. బేరసారాలు కూడా జోరుగా సాగుతున్నట్లు వినికిడి.

Hawks on the ridge గెడ్డవాగుపై గద్దలు
కబ్జా ప్రయత్నం జరుగుతున్న గెడ్డవాగు భూమి ఇదే

గెడ్డవాగుపై గద్దలు

ఇప్పటికే బోర్డు పీకేసిన అక్రమార్కులు

పేదల పేరిట అమ్మేయాలని ప్రణాళిక

జోరుగా సాగుతున్న బేరసారాలు

కన్నెత్తిచూడని రెవెన్యూ అధికారులు

విజయనగరం దాసన్నపేట, జూలై17(ఆంధ్రజ్యోతి):

నగర శివార్లలోని విజయనగరం నుంచి జమ్ము నారాయణపురం వెళ్లే దారిలో సర్వే నెంబరు 148/1( రెవెన్యూ రికార్డుల ప్రకారం)లో ఉన్న వాగుపై కబ్జాదారులు మరోసారి కన్నేశారు. ఈసారి ఎలాగైనా ఆక్రమించి అమ్మేయాలని చూస్తున్నారు. అందుకు నేతలను రంగంలోకి దించే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. బేరసారాలు కూడా జోరుగా సాగుతున్నట్లు వినికిడి.

గెడ్డవాగు విస్తీర్ణం 44 సెంట్లు కాగా 2014 నుంచి కబ్జా ప్రయత్నాలు జరుగుతున్నాయి. డైరెక్టుగా కబ్జా అయితే ఇబ్బందికరమని చెప్పి గతంలో పేదలను తెరపైకి తెచ్చారు. వారి పేరిట పట్టాలు ఇచ్చి, ఆ పట్టాలను తిరిగి కబ్జాదారులు తీసుకునేలా వ్యూహరచన చేశారు. తద్వారా 44 సెంట్లు (దాడాపు రూ.2 కోట్ల విలువైన)ను కాజేయాలనుకున్నారు. దీనిపై ఆంధ్రజ్యోతిలో మార్చి 6న ‘గెడ్డవాగుపై గెద్దలు’ శీర్షికన కథనం వచ్చింది. దీనికి స్పందించిన రెవెన్యూ అధికారులు ఆ స్థలంలో మార్చి 7న బోర్డు ఏర్పాటు చేశారు. ఇది గెడ్డవాగు.. ఆక్రమణదారులు శిక్షార్హులు అంటూ బోర్డుపై రాశారు. కొంతమంది ఆ బోర్డును తీసే ప్రయత్నం చేస్తే అప్పట్లో రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి కాపాడగలిగారు. అయితే తాజాగా కబ్జాదారులు తమ పలుకుబడిని మరోసారి ప్రయోగిస్తున్నారు. గెడ్డవాగు అంటూ ఏర్పాటు చేసిన బోర్డును తీసేశారు. రెవెన్యూ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడకుండా రాజకీయ పలుకుబడి, చతురతను ప్రదర్శిస్తున్నారు. దీంతో రెవెన్యూ అధికారులు తమకు ఏమీ తెలియదన్నట్టు ఉంటున్నారన్న విమర్శలు ఉన్నాయి.

- ప్రస్తుతం కబ్జాదారులు ఆ స్థలాన్ని అమ్మకానికి పెట్టారు. రికార్డులు మార్చేసే పనిలో ఉన్నారు. విలువైన ప్రభుత్వ భూమి ఈ ఏవిధంగా కబ్జాదారుల పాలవుతుంటే సచివాలయం సిబ్బంది కూడా మౌనం వహిస్తున్నారు.

అది ప్రభుత్వ స్థలమే

కూర్మనాథరావు, తహసీల్దారు

అది ముమ్మాటీకీ గెడ్డవాగే.. ప్రభుత్వ స్థలమే. గతంలో మూడు నాలుగు పర్యాయాలు బోర్డులు ఏర్పాటు చేశాం. సచివాలయ సిబ్బందిని కూడా పర్యవేక్షించాలని ఆదేశించాం. మళ్లీ బోర్డు ఏర్పాటు చేస్తాం. ఆ స్థలం కబ్జా కాకుండా చూస్తాం.

Updated Date - Jul 17 , 2025 | 11:54 PM