బ్యాడ్మింటన్ పోటీల్లో హారిక ప్రతిభ
ABN , Publish Date - Dec 29 , 2025 | 11:42 PM
స్థానిక ఫ్రెండ్స్ బ్యాడ్మింటన్ అకాడమీకి చెందిన భర్ణికాన హారిక దక్షిణ భారత ఇంటర్ యూనివర్సిటీ సౌత్‌జోన్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైనట్టు చీఫ్ కోచ్ పొట్నూరు శ్రీరాములు తెలిపారు.
శృంగవరపుకోట, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): స్థానిక ఫ్రెండ్స్ బ్యాడ్మింటన్ అకాడమీకి చెందిన భర్ణికాన హారిక దక్షిణ భారత ఇంటర్ యూనివర్సిటీ సౌత్‌జోన్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైనట్టు చీఫ్ కోచ్ పొట్నూరు శ్రీరాములు తెలిపారు. సోమవారం ఆయన మట్లాడుతూ వచ్చే ఏడాది జనవరి 11, 12 తేదీలలో ఆంధ్ర యూనివర్శిటీ ఇండోర్ స్టేడియంలో ఈ పోటీ లు జరుగుతాయని చెప్పారు. ఈసందర్భంగా హారికను ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ కనకరావు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, ఫ్రెండ్స్ రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ సత్యశేఖర్, స్నేహా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు అట్లూరి శ్రీవెంకటరావు, ప్రతినిధులు మోహన్, రమేష్‌లు అభినందించారు.