Share News

Hara Hara Mahadeva హర హర మహాదేవ

ABN , Publish Date - Oct 27 , 2025 | 11:56 PM

Hara Hara Mahadeva శివాలయాలకు కార్తీక తొలి సోమవారం భక్తులు పోటెత్తారు. దీపారాధనలు, అభిషేకాలతో ఆలయ ప్రాంగణాలన్నీ కార్తీక శోభను సంతరించుకున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పూజలు నిర్వహించారు. ఉపవాసం కూడా పాటించారు. పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం, విశిష్ట అర్చనలు నిర్వహించారు.

 Hara Hara Mahadeva హర హర మహాదేవ
రింగురోడ్డులోని పశుపనాథేశ్వర స్వామి ఆలయంలో శివలింగానికి అభిషేకం

హర హర మహాదేవ

శివాలయాలకు పోటెత్తిన భక్తులు

ప్రత్యేక పూజలు.. దీపారాధనలు

విజయనగరం రూరల్‌, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): శివాలయాలకు కార్తీక తొలి సోమవారం భక్తులు పోటెత్తారు. దీపారాధనలు, అభిషేకాలతో ఆలయ ప్రాంగణాలన్నీ కార్తీక శోభను సంతరించుకున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పూజలు నిర్వహించారు. ఉపవాసం కూడా పాటించారు. పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం, విశిష్ట అర్చనలు నిర్వహించారు. ఉదయం 4 గంటల నుంచి క్యూలైన్లో ఉన్నారు. పురాతన శివాలయాల వద్ద ఎక్కువ సంఖ్యలో భక్తులు కనిపించారు. ఈశ్వర మాలధారణ చేసిన భక్తులు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోపురాల వద్ద కార్తీకదీపాలు వెలిగించారు. విజయనగరంతో పాటు, బొబ్బిలి, రాజాం, వంగర, సంతకవిటి, నెల్లిమర్ల, గుర్ల, చీపురుపల్లి, గజపతినగరం, బొండపల్లి, గంట్యాడ, ఎస్‌కోట, జామి తదితర ప్రాంతాల్లో వున్న శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఆలయాల కమిటీలు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక విజయనగరంలోని దేవస్థానం పరిధిలో ఉన్న వీరరాజేశ్వర స్వామి ఆలయం, శివాలయం వీధిలోని ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం, రింగురోడ్డులోని పశుపనాథేశ్వర స్వామి ఆలయాల్లో భక్తుల కోలాహలం నెలకొంది. ఒక వైపు వర్షం పడుతున్నా బారులు తీరి కనిపించారు.

Updated Date - Oct 27 , 2025 | 11:56 PM