Share News

happy new year సందడే సందడి

ABN , Publish Date - Dec 31 , 2025 | 11:49 PM

happy new year హ్యాపీ న్యూ ఇయర్‌ అంటూ జిల్లా ప్రజలు నింగినంటేలా చెప్పారు. కేరింతలతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించారు. వాకిళ్లను రంగురంగుల ముగ్గులతో నింపి నూతన సంవత్సరానికి అపూర్వ స్వాగతం పలికారు.

happy new year సందడే సందడి

సందడే సందడి

కొత్త సంవత్సరాన్ని ఘనంగా ఆహ్వానించిన జిల్లా ప్రజలు

కేక్‌లు కట్‌ చేస్తూ డ్యాన్సులు చేసిన యువత

విజయనగరం కల్చరల్‌, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి):

హ్యాపీ న్యూ ఇయర్‌ అంటూ జిల్లా ప్రజలు నింగినంటేలా చెప్పారు. కేరింతలతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించారు. వాకిళ్లను రంగురంగుల ముగ్గులతో నింపి నూతన సంవత్సరానికి అపూర్వ స్వాగతం పలికారు. ఇక యువత ఆనందానికి హద్దుల్లేవ్‌. ఒకవైపు కేక్‌లను కట్‌ చేస్తూ పాటలకు లయబద్ధంగా డ్యాన్స్‌లు చేస్తూ 2026 సంవత్సరానికి వెల్‌కమ్‌ చెప్పారు. బుధవారం రాత్రి 9 గంటలకు మొదలైన సందడి అర్ధరాత్రి ఒంటిగంట వరకు సాగింది. పాత ఏడాదికి టాటా చెబుతూ కొత్త ఏడాదికి ఆహ్వానం పలికారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మరోవైపు కొత్త సంవత్సరం తొలిరోజు అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ నాయకులు, ఉద్యోగులు, విద్యార్థులు శుభాకాంక్షలు తెలియజేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం మార్కెట్‌లో బొకేలు, మొక్కలు, గ్రీటింగ్‌లు విరివిగా కొనుగోలు చేశారు.

నూతన సంవత్సరం అంటే అందరికీ జోష్‌ ఉంటుంది. మహిళలు మరింత భిన్నంగా వివిధ రకాల రంగులతో ఇళ్ల ముందు రంగవల్లికలను తీర్చిదిద్ది కొత్త ఏడాదిని కలర్‌ఫుల్‌గా ఆహ్వానించారు. అలాగే తొలిరోజు ఆలయాలకు వెళ్లి కుటుంబ క్షేమం కోసం ప్రత్యేక పూజలు చేయనున్నారు.

Updated Date - Dec 31 , 2025 | 11:49 PM