Share News

happy movement సందడే... సందడి

ABN , Publish Date - Oct 07 , 2025 | 12:59 AM

happy movement మెగా మ్యూజికల్‌ నైట్‌ విజయనగరం ప్రజలను ఉర్రూతలూగించింది. యువత కేరింతలు కొట్టింది. అయోధ్యమైదానం ఈలలు, చప్పట్లతో మారుమోగింది. రెండురోజులుగా నిర్వహిస్తున్న విజయనగరం ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి నగరంలోని అయోధ్యమైదానంలో మెగా మ్యూజికల్‌ నైట్‌ ఏర్పాటు చేశారు.

happy movement సందడే... సందడి
గీతాలాపనలో గీతామాధురి, రాహుల్‌సిప్లిగంజ్‌

సందడే... సందడి

ఉర్రూతలూగించిన మెగా మ్యూజికల్‌ నైట్‌

వర్షంలోనూ సంగీత ప్రియులతో కిక్కిరిసిన అయోధ్యమైదానం

ముగిసిన విజయనగర ఉత్సవాలు

విజయనగరం/ టౌన్‌, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): మెగా మ్యూజికల్‌ నైట్‌ విజయనగరం ప్రజలను ఉర్రూతలూగించింది. యువత కేరింతలు కొట్టింది. అయోధ్యమైదానం ఈలలు, చప్పట్లతో మారుమోగింది. రెండురోజులుగా నిర్వహిస్తున్న విజయనగరం ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి నగరంలోని అయోధ్యమైదానంలో మెగా మ్యూజికల్‌ నైట్‌ ఏర్పాటు చేశారు. గీతా మాఽధురి, రాహుల్‌సిప్లిగంజ్‌, నోయాల్‌ పాడిన పాటలకు యువత, పెద్దలు తేడా లేకుండా సందడిచేస్తూ చిందేశారు. కార్యక్రమం చివరి వరకూ జోష్‌తో సాగింది. గీతామాధురి ఆలపించిన ‘పక్కా లోకల్‌.. పక్కాలోకల్‌ పాటకు విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితిగజపతిరాజు, ఎమ్మెల్సీ గ్రీష్మ డ్యాన్సు చేయటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నోయల్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌ ఇటు మెలోడీ, అటు హుషారైన పాటలను ఆలపించి కుర్రకారును కట్టిపడేశారు. నాట్‌నాట్‌ పాటకు ప్రాంగణం హోరెత్తిపోయింది. కొద్దిసేపు వర్షం పడినప్పటికీ తరువాత వాతావరణం అనుకూలించడంతో స్టేడియం సంగీత ప్రియులతో నిండిపోయింది. ఈ మ్యూజికల్‌ నైట్‌ను మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనువాస్‌, కందుల దుర్గేష్‌, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి, ఎస్పీ దామోదర్‌, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ కర్రోతు బంగా ర్రాజు, జనసేన నాయకులు అవనాపు విక్రమ్‌ తదితరులు వీక్షించారు.

- విజయనగరం ఉత్సవాలు సోమవారంతో ముగిసాయి. నేటితరం యువతకు, భవిష్యత్‌ తరాలకు విజయనగరం వైభవం, సంస్కృతి తెలిసేలా కార్యక్రమాలు నిర్వహించారు.

Updated Date - Oct 07 , 2025 | 12:59 AM