Share News

Happy Happy Christmas హ్యాపీ హ్యాపీ క్రిస్మస్‌

ABN , Publish Date - Dec 26 , 2025 | 12:31 AM

Happy Happy Christmas జిల్లాలో క్రిస్మస్‌ పర్వదినాన్ని క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. గురువారం ఉదయం నుంచి చర్చిల వద్ద ప్రత్యేక ప్రార్థనలతో పాటు యువకులు, పిల్లలతో సందడి వాతావరణం కనిపించింది. ప్రార్థనల అనంతరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని కంటోన్మెంట్‌ ఆర్‌సీఎం, స్వీమ్స్‌ బాప్టిస్ట్‌, కంటోన్మెంట్‌ బాప్టిస్ట్‌ చర్చిల్లో కోలాహలం కనిపించింది.

Happy Happy Christmas హ్యాపీ హ్యాపీ క్రిస్మస్‌

హ్యాపీ హ్యాపీ క్రిస్మస్‌

చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు

బహుమతులు ఇచ్చుకున్న క్రైస్తవులు

విజయనగరం కల్చరల్‌, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి):

జిల్లాలో క్రిస్మస్‌ పర్వదినాన్ని క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. గురువారం ఉదయం నుంచి చర్చిల వద్ద ప్రత్యేక ప్రార్థనలతో పాటు యువకులు, పిల్లలతో సందడి వాతావరణం కనిపించింది. ప్రార్థనల అనంతరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని కంటోన్మెంట్‌ ఆర్‌సీఎం, స్వీమ్స్‌ బాప్టిస్ట్‌, కంటోన్మెంట్‌ బాప్టిస్ట్‌ చర్చిల్లో కోలాహలం కనిపించింది. పండుగ ఆవశ్యకతను తెలియజేస్తూ ఫాదర్స్‌ తమ ప్రసంగాలతో క్రైస్తవులను ఆకట్టుకున్నారు. ఆయా చర్చిల ప్రాంగణాల్లో కొవ్వొత్తులు వెలిగిస్తూ ఏసు పుట్టుక సెట్‌లను అందరూ వీక్షించారు. స్టార్స్‌, క్రిస్మస్‌ చెట్ల వద్ద యువత సెల్ఫీలు దిగి సందడి చేశారు. పురాతన చర్చిల్లో ఒకటైన విజయనగరం స్వీమ్స్‌ మెమోరియల్‌ బాప్జిస్ట్‌ చర్చిలో బుధవారం అర్ధరాత్రి నుంచి ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఆయా చర్చిల పరిధిలో దాతల సహకారంతో పేద క్రిస్టియన్‌లకు నిత్యావసర వస్తువులు, వస్త్రాలను అందజేశారు. అన్ని ప్రాంతాల్లో చర్చిలు విద్యుత్‌ దీపాలతో శోభాయమానంగా కన్పిస్తున్నాయి.

Updated Date - Dec 26 , 2025 | 12:31 AM