Share News

దొరికిన బంగారం అప్పగింత

ABN , Publish Date - Dec 29 , 2025 | 11:40 PM

విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ లో దొరికిన బంగారు పుస్తెల తాడును చిట్టయ్యవలస గ్రామానికి చెందిన సత్య నారాయణ సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సీఐ రమణకు అప్పగించారు.

దొరికిన బంగారం అప్పగింత

గజపతినగరం, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ లో దొరికిన బంగారు పుస్తెల తాడును చిట్టయ్యవలస గ్రామానికి చెందిన సత్య నారాయణ సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సీఐ రమణకు అప్పగించారు. మండలంలోని చిట్టయ్యవలస గ్రామానికి చెందిన సత్యనారాయణ భార్య ఉమజయలక్ష్మి సొంత పనులపై విజయనగరం వెళ్లి, స్వగ్రామం వచ్చేందుకు ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వెళ్లగా.. అక్కడ 17 గ్రాముల బంగారు పుస్తెలతాడు ఆమె కంటపడింది. దీంతో ఆమె ఇంటికి వచ్చి భర్త సత్యనారాయణకు తెలియజే యగా.. ఆయన ఆ తాడును స్థానిక పోలీసులకు అందజేశారు. ఈసందర్భంగా సీఐ రమణ మాట్లాడుతూ దొరికిన బంగారాన్ని నిజాయితీతో అప్పగించడం గర్వించదగ్గ విషయమన్నారు. దీని విలువ సుమారు రూ.2లక్షలు ఉంటుంద న్నారు. ఈసందర్భంగా భార్య భర్తలను అభినందిస్తున్నట్టు తెలిపారు. అనంతరం విజయనగరం వన్‌టౌన్‌ పోలీసులకు బంగారాన్ని అప్పగించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌నాయుడు పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2025 | 11:40 PM