భూములు అప్పగించండి
ABN , Publish Date - Jul 24 , 2025 | 12:19 AM
భూములు అప్పగించాలని జిందాల్ భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. బుధవారం ఎస్.కోట తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి, కేఆర్‌సీసీ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ మురళికి వినతిపత్రం అందించారు. జిందాల్‌నిర్వాసితుల తరపున సీపీఎంనాయకుడు జగన్ సమస్యలను వివరించారు.
శృంగవరపుకోట జూలై 23 (ఆంధ్రజ్యోతి):భూములు అప్పగించాలని జిందాల్ భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. బుధవారం ఎస్.కోట తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి, కేఆర్‌సీసీ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ మురళికి వినతిపత్రం అందించారు. జిందాల్‌నిర్వాసితుల తరపున సీపీఎంనాయకుడు జగన్ సమస్యలను వివరించారు.
కాగా నష్టపరిహారం అందని అర్హులైన భూనిర్వాసితులను గుర్తించాలని కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశాలు జారీచేశారని కేఆర్‌సీసీ ప్రత్యేక ఉప కలెక్టర్ మురళి తెలిపారు. ఎస్.కోట తహసీల్దార్ శ్రీనివాసరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ్టపరి హారం కోసం కలెక్టర్‌కు భూ నిర్వాసితుల నుంచి కొన్ని దరఖాస్తులు అందాయని చెప్పా రు. తనకు11 దరఖాస్తులు ఇచ్చారని, వీటిని పరిశీలిస్తున్నానని తెలిపారు. అర్హుల నిర్థార ణ చేసిన తరువాత కలెక్టర్‌కు నివేదిస్తానని పేర్కొన్నారు. జిందాల్ భూ నిర్వాసితుల్లో కొందరు తమ భూములను తిరిగి ఇచ్చేయాలని, మరి కొందరు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారని తెలిపారు. వీరి విన్నపాలను కలెక్టర్ దృష్టిలో పెడతానని చెప్పారు.