Share News

గుర్ల మినీ రిజర్వాయర్‌ను పూర్తిచేస్తా

ABN , Publish Date - Dec 01 , 2025 | 12:44 AM

మండలంలోని గుర్ల గెడ్డ మినీ రిజర్వాయర్‌ పెండింగ్‌ పనులను పూర్తి చేసి, దాన్ని రైతులకు అంకితం చేసే బాధ్యతను తాను తీసుకుంటానని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు

గుర్ల మినీ రిజర్వాయర్‌ను పూర్తిచేస్తా
మాట్లాడుతున్న మంత్రి సంధ్యారాణి

- మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మెంటాడ, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గుర్ల గెడ్డ మినీ రిజర్వాయర్‌ పెండింగ్‌ పనులను పూర్తి చేసి, దాన్ని రైతులకు అంకితం చేసే బాధ్యతను తాను తీసుకుంటానని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. గుర్ల గ్రామంలో ఆదివారం నిర్వహించిన రైతన్నా మీకోసం కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ ప్రభుత్వ హయాంలోనే గుర్ల గెడ్డ మినీ రిజర్వాయర్‌ను పూర్తిచేసి తీరుతామని ప్రకటించారు. రైతు సంక్షేమమే ప్రధాన అజెండాగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అన్నదాతకు అన్ని విధాలా అండదండగా నిలుస్తోందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకూ రూ.20వేలు అందిస్తున్నామని తెలిపారు. ధాన్యం సేకరించిన 24 గంటల్లో డబ్బు అకౌంట్లో జమ చేస్తామని చెప్పినా, నాలుగైదు గంటల్లోనే చెల్లిస్తున్నా ఘనత కూటమి ప్రభుత్వానిదేనని చెప్పారు. రైతులు సేంద్రియ ఎరువులు వైపు మొగ్గుచూపాలని కోరారు. మోతాదుకు మించిన రసాయన ఎరువులు వాడకం వల్ల దిగుబడి నష్టంతోపాటు ఆరోగ్య సమస్యలకు కారమవుతోందని అన్నారు. చిరుధాన్యాలను అలవాటు చేసుకోవాలని సూచించారు. యువత, నిరుద్యోగులకు ఉపాధి కల్పనతో వారి కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యమని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు చలుమూరి వెంకట్రావు, నాయకులు జి.అన్నవరం, సింగంపల్లి అప్పలనాయుడు, రెడ్డి ఆదినారాయణ, శరకాన రామునాయుడు, గొర్లె సన్యాసిరావు, అప్పికొండ సన్యాసిరావు, అప్పన్న, రెడ్డి ఎర్నాయుడు, గెడ్డ కాశీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 01 , 2025 | 12:44 AM