హామీలు కాగితాలకే పరిమితం: ఎమ్మెల్సీ
ABN , Publish Date - Dec 03 , 2025 | 11:44 PM
భూములను తీసుకున్న సమయం లో ఇచ్చిన హామీలను కాగితాలకు పరిమితం చేశారని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ఆరోపించారు. విజయనగరంలో గురువారం జరగనున్న జిల్లా సమీక్ష సమావేశంలో జిందాల్ భూ నిర్వాసితుల సమస్యను ప్రస్తావిస్తానని తెలిపారు.
శృంగవరపుకోట, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): భూములను తీసుకున్న సమయం లో ఇచ్చిన హామీలను కాగితాలకు పరిమితం చేశారని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ఆరోపించారు. విజయనగరంలో గురువారం జరగనున్న జిల్లా సమీక్ష సమావేశంలో జిందాల్ భూ నిర్వాసితుల సమస్యను ప్రస్తావిస్తానని తెలిపారు. బుధవారం మండలంలోని బొడ్డవరలో ఆందోళన చేస్తున్న జిందాల్ భూనిర్వాసితు లతో కఇసి మాట్లాడారు. ప్రజాభిప్రాయ సేకరణలో ఇచ్చిన మాటలను నిలబెట్టు కోలేదన్నారు. పరిశ్రమల ద్వారా జరిగే అభివృద్ధికి వ్యతిరేకంకాదన్నారు. కాగా ఎస్.కోటలోలని గిరిజన కళాశాల బాలికల వసతిగృహానికి రఘురాజు సీసీ కెమెరాలు అందజేశారు. ఆయన వెంట ఎంపీపీ ఎస్.సోమేశ్వరరావు, సర్పంచ్ గనివాడ సంతోషికుమారి, ఏఎస్.వెంకటరావు ఉన్నారు.