అధిక రాబడి వచ్చే పంటలను సాగుచేయండి
ABN , Publish Date - Oct 11 , 2025 | 11:17 PM
రైతులు అధిక రాబడి వచ్చే పంటలను సాగు చేయాలని కలెక్టర్ ఎస్.ప్రభాకర్‌రెడ్డి అన్నారు.
కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి
పార్వతీపురం, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): రైతులు అధిక రాబడి వచ్చే పంటలను సాగు చేయాలని కలెక్టర్ ఎస్.ప్రభాకర్‌రెడ్డి అన్నారు. పీఎం ధనధాన్య కృషియోజన, పప్పుధాన్యాల ఆత్మ నిర్భరత పథకాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్‌గా శనివారం ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్, జిల్లా వ్యవసాయాధికారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి రైతులతో మాట్లాడుతూ.. అధిక దిగుబడి, అధిక లాభాలు వచ్చే పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు పండించాలన్నారు. పామ్ ఆయిల్, కొబ్బరి, పూల్‌మఖానా, చెస్‌నట్స్ వంటి పంటలతో పాటు అంతర పంటల సాగువల్ల మరింత ఆదాయం పెరుగుతుందన్నారు. రైతులు చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చునని అన్నారు. పొలం గట్లుపై కందులు, కూరగాయలు వేయాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర ట్రాన్స్‌పోర్ట్ డైరెక్టర్ డి.శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయాధికారి కె.రాబర్ట్‌పాల్, ఉద్యానవనశాఖాధికారి కె.క్రాంతికుమార్, ప్రకృతి వ్యవసాయ అధికారి శ్రావణ్‌కుమార్, రైతులు పాల్గొన్నారు.