Share News

Greenhubs in 4 villages 4 గ్రామాల్లో గ్రీన్‌హబ్‌లు

ABN , Publish Date - Jul 03 , 2025 | 12:13 AM

Greenhubs in 4 villages మండలంలోని నాలుగు గ్రామాల్లో గ్రీన్‌హబ్‌లు ఏర్పాటు చేయడానికి విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఏ)సన్నాహాలు చేస్తోంది

Greenhubs in 4 villages 4 గ్రామాల్లో గ్రీన్‌హబ్‌లు
పెదరావుపల్లి గ్రామ రెవెన్యూలో భూములను పరిశీలిస్తున్న వీఎంఆర్‌డీఏకమిషనర్‌ విశ్వనాథన్‌

4 గ్రామాల్లో గ్రీన్‌హబ్‌లు

వీఎంఆర్‌డీఏ సన్నాహాలు

ప్లాట్లు వేసి అభివృద్ధి చేశాక విక్రయాలు

కొత్తవలస, జూలై 2(ఆంధ్రజ్యోతి): మండలంలోని నాలుగు గ్రామాల్లో గ్రీన్‌హబ్‌లు ఏర్పాటు చేయడానికి విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఏ)సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే మంగళవారం సాయంత్రం వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ విశ్వనాథన్‌ కంటకాపల్లి పంచాయతీ పెదరావుపల్లి గ్రామ రెవెన్యూ భూములను రెవెన్యూశాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. పెదరావుపల్లి, అర్దానపాలెం, చింతలపాలెం, వీరభద్రపురం గ్రామాల్లో కొంత స్థలాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తారు. చింతలపాలెంలో 15 ఎకరాల 30సెంట్లు, అర్దానపాలెంలో 29 ఎకరాల 56 సెంట్లు, కంటకాపల్లి పంచాయతీ పెదరావుపల్లి గ్రామ రెవెన్యూలో 72 ఎకరాల 18సెంట్లు, వీరభద్రపురంలో 15 ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. ఈ భూములను వీఎంఆర్‌డీఏ అభివృద్ధి చేసి ప్లాట్లు వేసి విక్రయిస్తుంది. తాము సేకరించిన భూములన్నీ ప్రభుత్వ భూములేనని, రైతుల ఆక్రమణలో ఉంటే వారికి నష్టపరిహారం చెల్లిస్తామని తహసీల్దార్‌ పి.అప్పలరాజు తెలిపారు. ఈ భూముల్లో వీఎంఆర్‌డీఏ నిబంధనల ప్రకారం రోడ్లు, కాలువలు, విద్యుత్‌ సౌకర్యం, మంచినీటి సౌకర్యం వంటి మౌలిక సదుపాయాలతో ప్లాట్లు వేస్తారు. భూములకు సంబంధించిన మ్యాప్‌లను వీఎంఆర్‌డీఏకు ఇప్పటికే అందజేశామని తహసీల్దార్‌ తెలిపారు. మండ లంలోని మరికొన్ని గ్రామాలు కూడా వీఎంఆర్‌డీఏ పరిధిలోకి వెళ్లాయని, దశలవారీగా ఆగ్రామాలలోనూ గ్రీన్‌హబ్‌లు ఏర్పాటు చేయనున్నారని చెప్పారు.

Updated Date - Jul 03 , 2025 | 12:13 AM