‘Stree Shakti’ ‘ స్త్రీశక్తి’కి గ్రీన్‌సిగ్నల్
ABN , Publish Date - Aug 06 , 2025 | 11:58 PM
Green Signal for ‘Stree Shakti’ స్ర్తీశక్తి పేరుతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి కూటమి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 15 నుంచి దీనిని ప్రారంభించాలని మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు సంబంధిత అధికారులంతా ఏర్పాట్లలో తలమునకలయ్యారు.
ఆమోదం తెలిపిన మంత్రివర్గం
పార్వతీపురం, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): స్ర్తీశక్తి పేరుతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి కూటమి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 15 నుంచి దీనిని ప్రారంభించాలని మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు సంబంధిత అధికారులంతా ఏర్పాట్లలో తలమునకలయ్యారు. తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ మేరకు పథకాన్ని పట్టాలెక్కించేందుకు పంద్రాగస్టును ముహూర్తంగా నిర్ణయించారు. జీరో ఫెయిర్ టిక్కెట్లు ఎలా ఇవ్వాలనే దానిపై ఇప్పటికే డిపోల్లో సిబ్బం దికి శిక్షణ ఇచ్చారు. కాగా జిల్లాలో మొత్తం 240 ఆర్టీసీ బస్సులున్నాయి. పార్వతీపురం డిపో కేంద్రంగా 56 ఆర్టీసీ, 33 అద్దె బస్సులు నడుస్తున్నాయి. సాలూరు డిపోలో ఆర్టీసీవి 48 , అద్దె బస్సులు 23 వరకూ ఉన్నాయి. పాలకొండ డిపోలో ఆర్టీసీకి చెందిన బస్సులు 58 , అద్దెవి 22 ఉన్నాయి. జిల్లాలో మరో 40 బస్సుల వరకూ అవసరం అవుతాయని అధికారులు అంచనా వేసి పంపించారు. అవసరమైతే పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా నడుపు తున్న 12 బస్సులను కూడా ‘స్ర్తీశక్తి’కి వినియోగించనున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులకు అందుబాటులో ఉంచుతూ మిగిలిన సమయాల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. ప్రస్తుతం నెలకు సుమారు రెండు లక్షల 50 వేల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. ఈ సంఖ్య మూడు లక్షలు దాటే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు అంచనా. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల జిల్లాలో ఆర్టీసీకి నెలకు రూ.కోటి 20 లక్షలు అదనపు భారం పడే అవకాశం ఉందని జిల్లా ప్రజా రవాణా అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు.
ఆనందంగా ఉంది..
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సీఎం చంద్రబాబునాయుడు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం ఎంతో ఆనం దంగా ఉంది. పార్వతీపురం నుంచి విజయనగరం వెళ్లాలంటే కనీసం రూ.200 ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇకపై ఆ పరిస్థితి ఉండదు.
- కె.జ్యోతి, గృహిణి, పార్వతీపురం
==================================
డబ్బులు ఆదా..
రామభద్రపురంలో కూరగాయలు కొనుగోలు చేసుకుని పార్వతీ పురంలో విక్రయిస్తుంటా. నాకు వచ్చే ఆదాయం రూ.300 నుంచి రూ.500 వరకు ఉంటుంది. ఇందులో రూ.వంద వరకు బస్సు చార్జీలకే పోతుంది. ఇకపై ఆ పరిస్థితి ఉండదు. ప్రభుత్వం నిర్ణయం.. మా లాంటి వారికి ఎంతగానో కలిసొస్తుంది. డబ్బులు ఆదా అవుతాయి.
- కె.లక్ష్మి, కూరగాయల వ్యాపారి, పార్వతీపురం