Share News

Green Signal 11 రహదారుల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌

ABN , Publish Date - Jun 12 , 2025 | 12:38 AM

Green Signal for Construction of 11 Roads జిల్లాలో పదకొండు రహదారుల నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులిచ్చింది. బుధవారం కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ అధ్యక్షతన వర్చువల్‌ విధానంలో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ శాఖ అధికారులు రోడ్ల నిర్మాణాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.

Green Signal   11 రహదారుల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌
మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌

పార్వతీపురం, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పదకొండు రహదారుల నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులిచ్చింది. బుధవారం కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ అధ్యక్షతన వర్చువల్‌ విధానంలో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ శాఖ అధికారులు రోడ్ల నిర్మాణాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. కురుపాం మండలంలో సందిగూడ-కాగుమానుగూడ (820 మీటర్లు), కాగుమానుగూడ నుంచి సాదిదంగు (820 మీటర్లు), పొద్దీస-సాలమానుగూడ (1320 మీటర్లు), సాలమానుగూడ - చాపరాయిగూడ (1300 మీటర్లు), దాముగూడ-చినంటుజోల ( 815 మీటర్లు), మంటికండ- దామూగడ (733 మీటర్లు), జేపులుపుట్ట -వైపులపుట్టి (1140 మీటర్లు), బాజారుగూడ - జేపులుపుట్టి (1120 మీటర్లు), తిత్తిరి-దొమ్మిడి ( 1208 మీటర్లు), దొమ్మిడి-గాలిమానుగూడ (1034 మీటర్లు), తిత్తిరి - గునుగుడ (1197 మీటర్లు) రహదారుల నిర్మాణానికి అనుమతులు జారీ అయ్యాయి. త్వరగా పనులు ప్రారంభించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ వర్చువల్‌ సమావేశంలో పార్వతీపురం, పాలకొండ సబ్‌ కలెక్టర్లు శ్రీవాత్సవ, సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, డీఎఫ్‌వో ప్రసూన తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2025 | 12:38 AM