Grant Pension! రూ.15వేలు పింఛన్ ఇప్పించండయ్యా!
ABN , Publish Date - Sep 08 , 2025 | 11:34 PM
Grant Us ₹15,000 Pension! శతశాతం దివ్యాంగురాలైన తన కుమార్తెకు రూ.15 వేల పింఛన్ మంజూరు చేయాలని సాలూరు బంగారమ్మకాలనీకు చెందిన చలమల గౌరి కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం ఇచ్చారు.
శతశాతం దివ్యాంగురాలైన కుమార్తెకు మంజూరు చేయాలని ఓ తల్లి వేడుకోలు
పార్వతీపురం, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): శతశాతం దివ్యాంగురాలైన తన కుమార్తెకు రూ.15 వేల పింఛన్ మంజూరు చేయాలని సాలూరు బంగారమ్మకాలనీకు చెందిన చలమల గౌరి కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం ఇచ్చారు. కుమార్తె రజనితో పాటు వచ్చిన ఆమెను చూసి కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ చలించిపోయారు. వెంటనే వారి వద్దకు వెళ్లి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పూర్తిగా మంచానికే పరిమితమైన తన కుమార్తెకు ప్రస్తుతం రూ.6 వేల దివ్యాంగ పింఛన్ వస్తుందని గౌరి వెల్లడించారు. అయితే ఆ మొత్తం ఏ మాత్రం చాలడం లేదని, తమ కుమార్తె వైద్యం, మందుల ఖర్చుల నిమిత్తం పింఛన్ మొత్తాన్ని పెంచాలని వేడుకున్నారు. దీనిపై తగు చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న డీఎంహెచ్‌వో భాస్కరరావు, డీసీహెచ్‌ఎస్ నాగభూషణ్‌ను కలెక్టర్ ఆదేశించారు. సమస్యను పరిష్కరిస్తామని, అధికారులే వచ్చి అవసరమైన సహకారం అందిస్తారని గౌరికి ఆయన తెలిపారు.