Grand Welcome to High Court Judge హైకోర్టు న్యాయమూర్తికి ఘన స్వాగతం
ABN , Publish Date - Dec 25 , 2025 | 12:20 AM
Grand Welcome to High Court Judge రాష్ట్ర హైకోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా స్వస్థలం పార్వతీపురం విచ్చేసిన జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్‌కు బుధవారం అధికారులు, బంధుమిత్రులు ఘన స్వాగతం పలికారు.
బెలగాం, డిసెంబరు24(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా స్వస్థలం పార్వతీపురం విచ్చేసిన జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్‌కు బుధవారం అధికారులు, బంధుమిత్రులు ఘన స్వాగతం పలికారు. అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వ దించారు. ఎస్పీ మాధవరెడ్డి న్యాయమూర్తిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో రెండో అదనపు జిల్లా న్యాయాధికారి దామోదరరావు, డీఆర్వో హేమలత, నీటిపారుదల శాఖ మాజీ డైరెక్టర్ ఎం.కృష్ణమోహన్ తదితరులు ఉన్నారు.