Kotadurgamma ఘనంగా కోటదుర్గమ్మ తిరువీధి
ABN , Publish Date - Oct 06 , 2025 | 12:26 AM
Grand Procession of Kotadurgamma ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పాలకొండ కోటదుర్గమ్మ తిరువీధి మహోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఈవో వీవీ సూర్య నారాయణ, ప్రధాన అర్చకుడు డి. లక్ష్మీ ప్రసాదశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఆకట్టుకున్న బళ్ల వేషాలు.. సాంస్కృతిక కార్యక్రమాలు
పాలకొండ, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పాలకొండ కోటదుర్గమ్మ తిరువీధి మహోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఈవో వీవీ సూర్య నారాయణ, ప్రధాన అర్చకుడు డి. లక్ష్మీ ప్రసాదశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సూూర్య ప్రభ పల్లకిలో తీరువీధి ఉత్సవం నిర్వహించగా.. భారీగా భక్తులు పోటెత్తారు. దుర్గమ్మను దర్శించుకుని పరవశించిపోయారు. అమ్మవారి ఉత్సవ విగ్రహం మోయడానికి పోటీపడ్డారు. పట్టణంలోని పలు వీధుల గుండా ఊరేగింపు కొనసాగింది. అంతకుముందు ఆలయం ఎదుట పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. నిమజ్జనోత్సవంలో బళ్లవేషాలు ఆకట్టుకున్నాయి. వాటిని చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. మరోవైపు సాముగరిడీలు, సవరడ్యాన్స్‌లు, కోలాటాలు, పులివేషాలు ఇతర వేషధారణలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ అలరించాయి. డీఎస్పీ రాంబాబు పర్యవేక్షణలో సీఐ ప్రసాదరావు, ఎస్‌ఐ ప్రయోగమూర్తితో పాటు డివిజన్‌లోని వందలాది మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పాలకొండ మాజీ సర్పంచ్ కొండలరావు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు సంతోష్‌కుమార్, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.