Share News

Yatra ఘనంగా కుంబిడి ఇచ్ఛాపురం యాత్ర

ABN , Publish Date - Nov 11 , 2025 | 01:00 AM

Grand Kumbidi Ichchapuram Yatra కార్తీకమాసం మూడో సోమవారం సందర్భంగా కుంబిడి ఇచ్ఛాపురంలో నిర్వహించిన యాత్రకు భక్తులు పోటెత్తారు. దీంతో ఆ ప్రాంతమంతా శివనామస్మరణ మార్మోగింది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా ఒడిశా నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తజనం వేకువజామునే ఉమామహేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు.

 Yatra   ఘనంగా కుంబిడి ఇచ్ఛాపురం యాత్ర
స్వయంభు శివలింగానికి అభిషేకాలు చేస్తున్న భక్తులు

వీరఘట్టం, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): కార్తీకమాసం మూడో సోమవారం సందర్భంగా కుంబిడి ఇచ్ఛాపురంలో నిర్వహించిన యాత్రకు భక్తులు పోటెత్తారు. దీంతో ఆ ప్రాంతమంతా శివనామస్మరణ మార్మోగింది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా ఒడిశా నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తజనం వేకువజామునే ఉమామహేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. క్యూ లైన్లలో గంటలకొద్దీ నిరీక్షించిన తర్వాత స్వయంభు శివలింగాన్ని దర్శించుకుని పరవశించి పోయారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీస్‌ సిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టారు. క్యూలైన్లలో తోపులాట జరగకుండా చూసుకున్నారు. వాహనాలకు ప్రత్యేక పార్కింగ్‌ ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులందరికీ అన్నదానం ఏర్పాట్లు చేశారు. ఎస్‌ఐ జి.కళాధర్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ బందోబస్తు నిర్వహించారు.

Updated Date - Nov 11 , 2025 | 01:00 AM