Share News

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి: ఎమ్మెల్సీ

ABN , Publish Date - Oct 08 , 2025 | 11:39 PM

:ప్రజలకు మెరుగైన సేవలు అందించేం దుకు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఎమ్మెల్సీ ఇందుకూరి కోరారు. బుధవారం ఎస్‌.కోట మండలపరిషత్‌కార్యాలయ సమావే శ మందిరంలో పంచాయతీలకు రెవెన్యూ సమకూర్చేందుకు సర్పంచ్‌లు, కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి: ఎమ్మెల్సీ
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు:

శృంగవరపుకోట, అక్టోబరు 8 (ఆంధ్రజ్యో తి):ప్రజలకు మెరుగైన సేవలు అందించేం దుకు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఎమ్మెల్సీ ఇందుకూరి కోరారు. బుధవారం ఎస్‌.కోట మండలపరిషత్‌కార్యాలయ సమావే శ మందిరంలో పంచాయతీలకు రెవెన్యూ సమకూర్చేందుకు సర్పంచ్‌లు, కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ మూలబొడ్డవ రలో గ్రామసభ కోసం గ్రామస్థులు దరఖాస్తు చేస్తే పెట్టకుండ అధికారులకు లేఖ రాయ డం ఆశ్చర్యంగా ఉందన్నారు. పెదఖండేపల్లి కార్యదర్శి గ్రామసభకు ఎజెండా ఇచ్చి గ్రామ సభలకు ప్రజలంతా వచ్చినతరువాత గెర్హాజర వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించా రు. రాజకీయ ఒత్తిళ్లకు తలోగ్గకుండ కార్యదర్శులు పని చేయాలని కోరారు. కార్యక్ర మంలో ఎంపీపీ సోమేశ్వరరావు, ఎంపీడీవో సతీష్‌, ఈవోపీఆర్డీ లక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Oct 08 , 2025 | 11:39 PM