Share News

రాజాపులోవ లో గ్రామసభ రసాభసా

ABN , Publish Date - Oct 08 , 2025 | 11:33 PM

మండలంలోని రాజాపులోవ పంచాయతీ కార్యాల యంలో బుధవారం జరిగిన గ్రామసభ రసాభసాగా మారింది. ఇరువర్గాలు బాహా బాహీకి దిగడంతో సభను నిలిపివేశారు.

  రాజాపులోవ లో గ్రామసభ రసాభసా
భోగాపురం: ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరుగుతున్న దృశ్యం :

భోగాపురం,అక్టోబరు8(ఆంధ్రజ్యోతి):మండలంలోని రాజాపులోవ పంచాయతీ కార్యాల యంలో బుధవారం జరిగిన గ్రామసభ రసాభసాగా మారింది. ఇరువర్గాలు బాహా బాహీకి దిగడంతో సభను నిలిపివేశారు. పంచాయతీ కార్యాలయంలో క్యార్యదర్శి సం తోష్‌కుమార్‌ ఆధ్వర్యంలో సర్పంచ్‌ కిలారిస్వప్న అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. తొలుత పలుఇళ్లపై నుంచి విద్యుత్‌ కండక్టర్‌ వైర్లు వెళ్తుండడంతో తొలగించడానికి కొం తఖర్చవుతుందని,వీటిని సంబందించి పంచాయతీతీర్మానించాలని పలువురు గ్రామసభ దృష్టికి తీసుకొచ్చారు.గ్రామసభ జరుగుతుండగా జనసేన మండలాధ్యక్షుడు వందనాల రమణ, మరికొందరు వచ్చి తీర్మానించాలని వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించడంతో పాటు తీర్మానించాలని పట్టుపట్టారు.దీంతో అక్కడ వైసీపీ,జనసేనకు చెందిన ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.పంచాయతీ కార్యాలయం ఆవరణలో కేకలతో హోరెత్తడం వల్ల సమాచారం అందుకున్న మహిళాపోలీస్‌ పార్వతి,కానిస్టేబుల్‌ చేరుకొని ఇరు వర్గాలను సర్దిచెప్పారు. దీంతో గ్రామసభ నిలిపివేసి సర్పంచ్‌ స్వప్న,రమణ, వైసీపీ వర్గీ యులు కార్యాలయం నుంచి బయటికి వచ్చేశారు. బయట కూడా ఇరువర్గాలు బాహా బాహీకి దిగడంతోవారిని పోలీసులు విడదీసి అక్కడ నుంచి పంపించివేశారు. తీర్మానం చేయకపోవడంపై కొంతసమయం జనసేననాయకులు ప్ల్లకార్డులు పట్టుకొని పంచాయ తీకార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. అనంతరం కార్యదర్శికి వినతిప త్రం అందజేశారు.అనంతరం జనసేన మండలాధ్యక్షుడు వందనాల రమణ మాట్లాడు తూ సమస్యలు పరిష్కరించడానికి తీర్మానించకపోగా తమ కార్య కర్తలపై దౌర్జన్యానికి దిగడం దారుణంగా ఉందన్నారు. కార్యదర్శి ఎ.సంతోష్‌ కుమార్‌ మాట్లాడుతూ గ్రామ సభ నిలిపివేయడంపై ఈవోపీఆర్డీ దృష్టికి తీసుకెళ్లి తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

జాగరంలో గ్రామసభ

జామి, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): గ్రామ సచివాలయాల్లో సిబ్బంది ప్రజలకు అం దుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జాగరం గ్రామస్థులు కోరారు. బుధవారం మండలంలోని జాగరంలో నిర్వహించిన గ్రామసభలో పలువురు యువకులు, సర్పంచ్‌ వసి పార్వతీ తదితరులు మాట్లాడుతూ కొందరు సిబ్బంది విశాఖనుంచి రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు.

Updated Date - Oct 08 , 2025 | 11:33 PM