Share News

Grading of teachers on screen తెరపైకి ఉపాధ్యాయుల గ్రేడింగ్‌

ABN , Publish Date - Dec 03 , 2025 | 11:39 PM

Grading of teachers on screen ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల గ్రేడింగ్‌ విధానం మరోసారి తెరపైకి వచ్చింది. అటుగా ప్రభుత్వం దృష్టిసారించింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా గ్రేడింగ్‌ విధానం తీసుకురాగా అప్పట్లో కేవలం బదిలీల సమయంలోనే అమలు చేసింది. ప్రస్తుతం మరింత వినూత్నంగా తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై లోతుగా కసరత్తు జరుగుతోంది. ఈ అంశంపై ఉపాధ్యాయుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.

Grading of teachers on screen తెరపైకి ఉపాధ్యాయుల గ్రేడింగ్‌

తెరపైకి ఉపాధ్యాయుల గ్రేడింగ్‌

విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ప్రత్యేక విధానం

క్షేత్రస్థాయిలో కేపీఐ సర్వే

నాడు కౌన్సెలింగ్‌ సమయంలో అమలు

నేడు మరింత వినూత్నంగా తేవాలని ఆలోచన

ఉపాధ్యాయుల నుంచి మిశ్రమ స్పందన

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల గ్రేడింగ్‌ విధానం మరోసారి తెరపైకి వచ్చింది. అటుగా ప్రభుత్వం దృష్టిసారించింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా గ్రేడింగ్‌ విధానం తీసుకురాగా అప్పట్లో కేవలం బదిలీల సమయంలోనే అమలు చేసింది. ప్రస్తుతం మరింత వినూత్నంగా తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై లోతుగా కసరత్తు జరుగుతోంది. ఈ అంశంపై ఉపాధ్యాయుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.

బొబ్బిలి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి):

ఉపాధ్యాయుల బదిలీల కోసం 2017లో మొదటిగా అప్పటి ప్రభుత్వం గ్రేడింగ్‌ విధానాన్ని తీసుకొచ్చింది. ఎపెక్స్‌ యాప్‌లో నమోదైన వారికి, పాఠశాలల్లో మధ్యాహ్నభోజనం తీసుకునే విద్యార్థుల సంఖ్య, విద్యార్థుల హాజరు, వారి ఉత్తీర్ణతా శాతం ప్రాతిపదికగా తీసుకొని ఉపాధ్యాయులకు గ్రేడింగ్‌ ఇచ్చారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు సాధించిన వారికి అదనంగా పాయింట్లు ఇచ్చారు. వీటిని ఉపాధ్యాయుల బదిలీ కౌన్సెలింగ్‌లో మాత్రమే వినియోగించారు. ప్రస్తుతం మరింత వినూత్నంగా ఉపాధ్యాయులకు గ్రేడింగ్‌ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై కీ పెర్‌ఫార్మెన్స్‌ ఇండికేటర్స్‌ (కేపీఐ) ప్రక్రియ జరుగుతోంది. దాదాపు పూర్తయింది. ప్రతీ సబ్జెక్టులో విద్యార్థుల సగటు మార్కులను ప్రాతిపదికగా తీసుకొని ఈ గ్రేడింగ్‌ విధానాన్ని తీసుకొస్తున్నారు.

ప్రతి మండలంలో నాలుగు నుంచి ఆరు క్లస్టర్స్‌ ఉండగా ఒక డైట్‌ విద్యార్థి, క్లస్టర్‌ రీసోర్స్‌ మోనటరింగ్‌ టీచర్‌ (సీఆర్‌ఎంటీ) ఆధ్వర్యంలో ప్రతీ క్లస్టర్‌లో ఉపాధ్యాయుల పనివిధానానికి సంబంధించి సర్వే చేపట్టారు. ఇందుకోసం కొన్ని పారామీటర్స్‌ను నిర్దేశించారు. సబ్జెక్టువారీగా విద్యార్థులకు వచ్చిన మార్కులతో పాటు నాలుగు గ్యారెంటీడ్‌ ఫండమెంటల్‌ లిటరసీ న్యూమరసీ (జీఎఫ్‌ఎల్‌ఎన్‌)అంశాలను పరిగణనలోకి తీసుకొని సర్వే నిర్వహిస్తున్నారు. విద్యార్థుల మార్కులతో పాటు స్పీకింగ్‌, లెర్నింగ్‌, రైటింగ్‌ తదితర నైపుణ్యాలను పరిశీలిస్తారు.

ఉపాధ్యాయుల్లో మిశ్రమ స్పందన

గ్రేడింగ్‌పై ఉపాధ్యాయులు భిన్నంగా స్పందిస్తున్నారు. విద్యావ్యవస్థలో సమూలమైన సంస్కరణలను తీసుకొచ్చి అభ్యుదయ ప్రగతిని సాధించాలన్నది సర్కారు సంకల్పం. ఇది మంచి ఆలోచనే కానీ పట్టణ, గ్రామీణ, ఇతర వెనుకబడిన ప్రాంతాలకు చెందిన అన్ని పాఠశాలలకు ఒకే రకమైన పారామీటర్స్‌ తెస్తే కొన్ని ఇబ్బందులు ఉంటాయని పలువురు భావిస్తున్నారు. ఉపాధ్యా యులు రోజంతా శ్రమించి తరగతి గదిలో పాఠాలు చెప్పినా విద్యార్థుల అభ్యసనా సామరఽ్ధ్యంలో (ఐక్యూ లెవెల్స్‌)లో తేడాలు ఉంటాయంటున్నారు. వలస వెళ్లిన తల్లిదండ్రుల పిల్లలు కాస్త వెనకబడి ఉంటుంటారని, కొన్ని పాఠశాలల్లో అధికంగా, మరికొన్ని చోట్ల తక్కువగా విద్యార్థుల సంఖ్య ఉంటుందని, ఆయా చోట్ల బోధన, మార్కుల కొలమానం వేరుగా ఉంటుందని చెబుతున్నారు. అన్నిటికీ ఒకే మూసపద్ధతిని వర్తింపజేయకూడదన్నది మెజార్టీ ఉపాధ్యాయుల అభిప్రాయం.

- ఎన్‌సీఆర్‌టీ సిలబస్‌ను అమలు చేస్తుండడం పెను సమస్యగా ఉపాధ్యాయులు భావిస్తున్నారు. బండెడు సిలబస్‌ను బాగా తగ్గించాలంటున్నారు. ఒక్కో పాఠం చాలా పెద్దదిగా ఉంటోందని, అప్లికేషన్‌ మెథడ్‌లో పరీక్షలను సెంట్రలైజ్డ్‌ పద్ధతిలో నిర్వహించడం లోపభూ యిష్టంగా తయారైందని అభిప్రాయపడుతున్నారు.

పనితనంపై సర్వే

కె.మోహనరావు, డిప్యూటీ విద్యాశాఖాధికారి, బొబ్బిలి

క్లస్టర్‌ వారీగా ఉపాధ్యాయుల పనితనానికి సంబంధించి జీఎఫ్‌ఎల్‌ఎన్‌ సర్వేను ప్రభుత్వం చేపట్టింది. దీనిపై అన్ని జిల్లాల నుంచి నివేదిక అందాక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. పరీక్షలలో సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు వచ్చిన సగటు మార్కుల ఆధారంగా ఈ సర్వే జరుగుతోంది. జిల్లాలో ఒక డైట్‌ విద్యార్థి, సీఆర్‌ఎంటీ కలిసి ఈ సర్వే నిర్వహిస్తున్నారు.

Updated Date - Dec 03 , 2025 | 11:39 PM