Share News

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

ABN , Publish Date - Nov 19 , 2025 | 11:50 PM

రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు ప్రజాప్రతినిధులు, అధికారులు తెలిపారు. బుధవారం జిల్లాలోని పలుచోట్ల ఖరీఫ్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
విజయనగరం రూరల్‌: గుంకలాంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే అదితి గజపతిరాజు

రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు ప్రజాప్రతినిధులు, అధికారులు తెలిపారు. బుధవారం జిల్లాలోని పలుచోట్ల ఖరీఫ్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

ఫ విజయనగరం రూరల్‌,నవంబరు 19 (ఆంధ్రజ్యోతి):మండలంలోని గుంకలాంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ప్రారంభించారు. రైతు భరోసా, పీఎం కిసాన్‌ నిధులు విడుదల కావడం తో రైతులతో గ్రామంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తూర్పుకాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ పాలవలస యశస్వి పాల్గొన్నారు.

ఫడెంకాడ, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): మండలంలోని చొల్లంగిపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే లోకం నాగమాధవి ప్రారంభించారు. కార్యక్రమంలో విజయనగరం డివిజన్‌ వ్యవసాయ సహాయక సంచాలకు లు నాగభూషణరావు, తహసీల్దార్‌ రాజారావు, ఎంపీడీవో భవాని, ఏవో టి.సంగీత, ఎస్‌ఐ సన్యాసినాయుడు, టీడీపీ, జనసేన నాయకులు పాల శ్రీను, టి .ప్రకాష్‌, సూరిబాబు, ఏఈఓ రామకోటి పాల్గొన్నారు.

ఫ శృంగవరపుకోట (వేపాడ), నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) వేపాడ తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో ధాన్యం కొనుగోలు కేం ద్రాన్ని కలెక్టర్‌ ఎస్‌.రామచందర్‌ రెడ్డి, ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ప్రారంభిం చారు. ఽకార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ గొంప కృష్ణ, టీడీపీ మండలాఽ ద్యక్షుడు గొంప వెంకటరావు, కోట్యాడ రమణ మూర్తి, పోతల రమణ, తహసీల్దార్‌ రాములమ్మ, సీఎస్‌డీటీ ఇందిర, ఏవో ఎం.స్వాతి పాల్గొన్నారు.

Updated Date - Nov 19 , 2025 | 11:50 PM