Share News

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

ABN , Publish Date - Jun 17 , 2025 | 11:51 PM

. సీఎం నారా చంద్రబాబునాయుడు రైతుల సంక్షేమానికి కృషిచేస్తున్నారని శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తెలిపారు. మంగళవారం స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో వరి విత్తనాలను పంపిణీ చేశారు.

 రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
రైతులకు విత్తనాలను పంపిణీ చేస్తున్న లలితకుమారి:

శృంగవరపుకోట, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): . సీఎం నారా చంద్రబాబునాయుడు రైతుల సంక్షేమానికి కృషిచేస్తున్నారని శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తెలిపారు. మంగళవారం స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో వరి విత్తనాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఖరీఫ్‌ సీజన్‌కు అవసరమై వరి విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఆన్‌లైన్‌లో రైతులు విత్తనాలకు నమోదు చేసుకోవాలని చెప్పారు. నాలుగు రోజుల్లో రైతు ఖాతాల్లో నిధులు పడతాయన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు రాయవరపు చంద్రశేఖర్‌, ఇందుకూరి సుధారాణి, సర్పంచ్‌ గనివాడ సంతోషి కుమారి, టీడీపీ మండలాధ్యక్షుడు జీ.ఎస్‌ నాయుడు, మాజీ ఎంపీపీ రెడ్డి వెంకన్న, నాయకులు కొణదం మల్లేశ్వరరావు, కాపుగంటి వాసు, పెదగాడి రాజు, చెక్క కిరణ్‌ పాల్గొన్నారు.

క్రీడా హబ్‌గా తీర్చిదిద్దాలి

లక్కవరపుకోట, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాన్ని క్రీడా హబ్‌గా తీర్చి దిద్దాలని ఎమ్మెల్యే లలితకుమారి కోరారు. మంగళవారం లక్కవరపుకోటలో పి.శ్రీరాములు ఆధ్వర్యంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడల్లో నియోజకవర్గాన్ని జిల్లాలో ముందుండేలా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో వెంకటరమణ, వెంకట రావు, అప్పలకొండ, గాలి రవికుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2025 | 11:51 PM