Share News

విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి

ABN , Publish Date - Apr 12 , 2025 | 12:10 AM

విద్యాభివృ ద్ధికి రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు.

  విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి
విద్యార్థినులతో థింసా నృత్యం చేస్తున్న ఎమ్మెల్యే విజయచంద్ర

పార్వతీపురం టౌన్‌/ బెలగాం, ఏప్రిల్‌ 11 (ఆంధ్ర జ్యోతి): విద్యాభివృ ద్ధికి రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. శుక్రవారం స్థానికఎస్‌వీడీ డిగ్రీ కళాశాల ఆవరణలో పీఎం ఉష కింద మంజూరైన బాలికల వసతి గృహం నిర్మాణా నికి ఆర్జేడీ ఎస్‌.శోభారాణితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అంతకముందు ఎమ్మెల్యే కు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆధ్వర్యంలో విద్యా ర్థులు ఘనం స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే విద్యార్థినులతో కలిసి థింసా నృత్యం చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందు లు లేకుండా తగిన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అందులో భాగం గా జిల్లా కేంద్రంలో బాలికల కోసం ఎస్‌వీడీ కళాశాలలో రూ.5 కోట్లతో వసతి గృహం నిర్మి స్తున్నామని, రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో 26 జిల్లాలకు గాను 22 జిల్లాలకే పీఎం ఉష పథకం కింద బాలికల వసతి గృహాలు మంజూరు చేశారని, అందులో పార్వతీపురం జిల్లా ఉందని తెలిపారు. అనం తరం డిగ్రీ కళాశాలలో జరిగిన ఫేర్‌వెల్‌ కార్యక్ర మానికి హాజరై విద్యార్థులను ఉద్దేశించి, మాట్లా డారు. అన్ని రంగాల్లో తమ సత్తా చాటి జిల్లా ప్రతిభను చాటాలని కోరారు. ఈసందర్భంగా ఎమ్మెల్యేను ప్రిన్సిపాల్‌ సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బి.జయబాబు, కౌన్సిలర్లు మధు, కోరాడ నారాయణ రావు, బడే గౌరి నాయుడు తదితర నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2025 | 12:10 AM