కళల అభివృద్ధికి ప్రభుత్వం కృషి:ఎంపీ కలిశెట్టి
ABN , Publish Date - May 11 , 2025 | 11:40 PM
కళారంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తోందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు.
గరివిడి, మే 11 (ఆంధ్రజ్యోతి): కళారంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తోందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. గరివిడిలో ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలలో చివరిరోజైన ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గరివిడి కల్చరల్ అసోషియేషన్ భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా తనతో పాటు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం అర్హులైన కళాకారులకు పింఛను సౌకర్యం కల్పిస్తోందన్నారు. అంతరించిపోతున్న నాటకాల విశిష్టతను యువతకు తెలియపరిచేందుకు గరివిడి కల్చరల్ అసోషియేషన్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఆదివారం రాత్రి కొత్త పరిమళం, చీకటిపువ్వు, సేవారాగం అనే నాటికలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి కె.త్రిమూర్తులురాజు, లోక్‌సత్తా పార్టీ జిల్లా అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ, నటి కవిత, వాకాడ గోపి, ఎం.జగన్నాథరాజు, చింతాడ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.