Poor పేదలకు అండగా ప్రభుత్వం
ABN , Publish Date - Dec 01 , 2025 | 11:30 PM
Government Stands by the Poor కూటమి ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. సోమవారం సాలూరు మున్సిపాలిటీలోని 11వ వార్డులో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు.
సాలూరు, డిసెంబరు1(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. సోమవారం సాలూరు మున్సిపాలిటీలోని 11వ వార్డులో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో 38 , మున్సిపాలిటీలో 12 చొప్పున కొత్తగా పింఛన్లు మంజూరైనట్లు వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా అర్హులం దరికీ ప్రభుత్వం పింఛన్లు అందజేస్తుందన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. ఆమె వెంట టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.
92 శాతం పింఛన్ల పంపిణీ
పార్వతీపురం, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): జిల్లాలో తొలిరోజు 92 శాతం మేర పింఛన్లు పంపిణీ చేశారు. మొత్తంగా 1,39,593 లబ్ధిదారులు ఉండగా సోమవారం 1,28,777 మంది పింఛన్ నగదు అందజేశారు.