Share News

ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తా

ABN , Publish Date - May 25 , 2025 | 12:09 AM

తన తండ్రి బొబ్బిలి రాజాశ్రీ ఆర్‌వీజీకే రంగారావు శతజయంతి సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ని తన సొంత నిధులతో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే బేబీనాయన తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తా

  • బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన

బొబ్బిలి రూరల్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): తన తండ్రి బొబ్బిలి రాజాశ్రీ ఆర్‌వీజీకే రంగారావు శతజయంతి సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ని తన సొంత నిధులతో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే బేబీనాయన తెలిపారు. ఈసందర్భంగా శనివారం ఆయన బొబ్బిలి కోటలో ఆసుపత్రి వైద్యులతో మాట్లాడా రు. ఆసుపత్రి అభివృద్ధి కోసం కావల్సిన నిధుల కోసం వైద్యఆరోగ్య శాఖ మంత్రితో గతంలో చర్చించిన విషయాన్ని తెలియజేశారు. వాటితో పాటు తన తండ్రి జ్ఞాపకార్థం సొంత నిధులతో ఆసుపత్రిని అభివృద్ధి చేయిస్తానని సూపరింటెం డెంట్‌ జి.శశిభూషణరావుకు తెలిపారు. ఎక్కడె క్కడ అత్యవసర సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సి ఉందో వైద్యులను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే తమ వ్యక్తిగత సిబ్బందిని పంపించి పనులు మొదలయ్యేలా చూస్తామని తెలిపారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2025 | 12:09 AM