రైతులకు మేలు జరిగేలా పాలన: కిమిడి
ABN , Publish Date - Nov 20 , 2025 | 11:57 PM
: రైతులకు మేలు జరిగేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలిస్తున్నారని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు తెలిపారు. గురువారం మండలంలోని కోడూరు పంచాయతీలో వరిపంటను పరిశీ లించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు ప్రభుత్వం పంపిణీ చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో సారిపాక సురేష్‌కుమార్, ఎలకల వెంకునాయుడు, సత్తిరాజు పాల్గొన్నారు.
గరివిడి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): రైతులకు మేలు జరిగేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలిస్తున్నారని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు తెలిపారు. గురువారం మండలంలోని కోడూరు పంచాయతీలో వరిపంటను పరిశీ లించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు ప్రభుత్వం పంపిణీ చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో సారిపాక సురేష్‌కుమార్, ఎలకల వెంకునాయుడు, సత్తిరాజు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలుచేసిన వెంటనే డబ్బుల జమ
గుర్ల, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తోందని టీడీపీ రాష్ట్రకార్యదర్శి కిమిడిరామ్‌మల్లిక్‌నాయుడు తెలిపారు. తెట్టంగి పీఏసీఎస్‌లో సొసైటీ అధ్యక్షుడు కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేం ద్రం ప్రారంభించారు. ఈసందర్భంగా రామ్‌మల్లిక్‌నాయుడు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే వారి ఖాతాల్లో డబ్బులు జమచేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆదిలక్ష్మి, ఏవో తిరుపతిరావు, టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్య దర్శి సన్యాసినాయుడు, జమ్ము సొసైటీ అధ్యక్షులు మహేశ్వరరావు, పిల్ల అప్పల నాయుడు, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు దాసరి శివప్రసాద్, కృష్ణ పాల్గొన్నారు.