Share News

మత్స్యకారులందరికీ సరుకులు

ABN , Publish Date - Nov 01 , 2025 | 12:07 AM

కార్డులున్న మత్స్యకారులందరికీ బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు ఉచితంగా అందజేయాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేసినట్లు మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌, నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బం గార్రాజు తెలిపారు.

మత్స్యకారులందరికీ సరుకులు
రాంసుందర్‌ రెడ్డికి సమస్యను వివరిస్తున్న బంగార్రాజు :

భోగాపురం, అక్టోబరు31(ఆంధ్రజ్యోతి): కార్డులున్న మత్స్యకారులందరికీ బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు ఉచితంగా అందజేయాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేసినట్లు మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌, నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బం గార్రాజు తెలిపారు. మొంథా తుఫాన్‌ నేపథ్యంలో మత్స్యకారులకు ప్రభుత్వం 50 కేజీల బియ్యంతోపాటు పప్పు, ఆయిల్‌, పంచదార, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు నిత్సవసర సరుకులు పంపిణీచేస్తోంది. అయితే భోగాపురం, పూసపాటిరేగ మండలా ల పరిధిలోగల తీరప్రాంత గ్రామాల్లో 6800 రేషన్‌కార్డుదారులు ఉండగా 3953 కుటుంబాలకుమాత్రమే బియ్యంతోపాటు సరుకులు మంజూరయ్యాయి. ఈనేపథ్యం లో భోగాపురం, పూసపాటిరేగ మండలాలకు చెందిన పతివాడ తమ్మునాయుడు, ఆకిరిజగన్‌, తదితరనాయకులతో కలిసి బంగార్రాజు శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ రాంసుందర్‌ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. దీంతో కలెక్టర్‌ కార్డులు ఉన్న అందరికీ సరుకులు అందజేయాలని ఆదేశించాని బంగార్రాజు తెలిపారు.

Updated Date - Nov 01 , 2025 | 12:07 AM