aasha ఆశాలకు తీపికబురు
ABN , Publish Date - Aug 16 , 2025 | 11:23 PM
Good News for aasha జిల్లాలో ఆశా కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారి దీర్ఘకాల ప్రధాన డిమాండ్లను అంగీకరించింది. ఆశాల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచింది. సంవత్సరానికి రూ.5 వేల చొప్పున గ్రాట్యుటీ, వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
పార్వతీపురం, ఆగస్టు16(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆశా కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారి దీర్ఘకాల ప్రధాన డిమాండ్లను అంగీకరించింది. ఆశాల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచింది. సంవత్సరానికి రూ.5 వేల చొప్పున గ్రాట్యుటీ, వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి జీవో నెంబరు-19 జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో సుమారు 1476 మంది ఆశా కార్యకర్తలకు లబ్ధి చేకూరనుంది. వాస్తవంగా తమ సమస్యల పరిష్కారం కోసం వారు గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధాన డిమాండ్లకు అంగీకారం తెలపడంతో జిల్లాలో ఆశా వర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.