చంద్రబాబుతోనే సుపరిపాలన
ABN , Publish Date - Jul 06 , 2025 | 12:19 AM
ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యపడుతుందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.

పాలకొండ, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యపడుతుందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. తుమరాడ గ్రామంలో శనివారం నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం లో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఏడాది కాలంలోనే రాష్ట్రానికి రూ.8లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని, ఇది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ ఘనత అన్నారు. దీంతో లక్షలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. ఇప్పటికే సూపర్‌సిక్స్ పథకాల్లో నాలుగింటిని పూర్తి చేశామని, ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రయా ణం, రైతులకు అన్నదాత సుఖీభవ కింద నిధులను జమ చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షే మ పథకాలను వివరించారు. ప్రజా సమస్య లపై ఆరా తీశారు. స్థానిక రామాలయం వద్ద కూర్చొని స్థానికులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని తాగునీటి సమస్య ఉందని మహిళలు మంత్రి దృష్టికి తీసుకురాగా స్థానిక ఎమ్మెల్యేతో చర్చించి సమస్యను పరిష్క రిస్తామన్నారు. వివిధ సమస్యలను పలువురు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అంతకుముందు మంత్రి కోటదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఈ కార్య క్రమంలో శ్రీకాకుళం డీసీసీబీ చైర్మన్ సూర్యనారా యణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కర్నేన అప్పలనాయుడు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పడాల భూదేవి, జాడ శ్రీధర్, వారాడ సుమంత్‌నాయుడు, కర్నేన యోగిత, గండి రామినాయుడు తదితరులు పాల్గొన్నారు.