కూటమి ప్రభుత్వంతోనే సుపరిపాలన
ABN , Publish Date - Jul 30 , 2025 | 12:14 AM
రాష్ట్రంతో కూటమి ప్రభుత్వంతోనే సుప రిపాలన సాధ్యమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు.
నెల్లిమర్ల, జూలై 29 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్రంతో కూటమి ప్రభుత్వంతోనే సుప రిపాలన సాధ్యమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. మంగళవారం కొండవెలగాడ గ్రామంలో మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, విశాఖ ఉత్తర నియోజకవర్గం పరిశీలకుడు సువ్వాడ రవిశేఖర్‌తో కలిసి ఆయన సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహిం చారు. ఈసందర్భంగా ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల కరపత్రాలు పంపిణీ చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందు కు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంద న్నారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గేదెల రాజారావు, అవనాపు సత్యనారాయణ, కాళ్ల రాజశేఖర్, దంతులూరి అజయ్‌బాబు, మొయి ద సత్యనారాయణ, శ్రీనివాసరావు, మొయిద సీతంనాయుడు, చల్లా రాము పాల్గొన్నారు.