Gold Prices భగ్గుమన్న బంగారం ధర
ABN , Publish Date - Oct 04 , 2025 | 11:57 PM
Gold Prices on the Rise పసిడి ధర మళ్లీ పెరిగింది. శనివారం ఒక్క రోజు రూ. 500 వరకూ పెరిగింది. దీంతో 24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.1,21,410 ఉండగా.. తులం రూ.1,41,612గా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాములు రూ. 1,09,450 ఉండగా.. తులం ధర రూ. 1,27,660గా ఉంది. వెండి సైతం కిలో రూ. 1,55,000లుగా ఉంది.
26 రోజుల్లో రూ. 10 వేలు పెరిగిన వైనం
సాలూరు రూరల్, అక్టోబరు4(ఆంధ్రజ్యోతి): పసిడి ధర మళ్లీ పెరిగింది. శనివారం ఒక్క రోజు రూ. 500 వరకూ పెరిగింది. దీంతో 24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.1,21,410 ఉండగా.. తులం రూ.1,41,612గా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాములు రూ. 1,09,450 ఉండగా.. తులం ధర రూ. 1,27,660గా ఉంది. వెండి సైతం కిలో రూ. 1,55,000లుగా ఉంది. కాగా గత 26 రోజుల్లో రూ. 10 వేలు పైబడి బంగారం ధర పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. వివాహాలు, శుభకార్యాలున్న వారు పసిడిని కొనేందుకు జంకుతున్నారు. ‘బంగారం మార్కెట్‌ను అంచనా వేయలేకపోతున్నాం. పసిడి ధర ర్యాలీ కొనసాగుతుంది. గత 26 రోజుల్లో ఇప్పటికి ధర బాగా పెరిగింది. దీనికి ఎప్పుడు బ్రేక్ పడుతుందో చెప్పలేం. అవసరం బట్టి, స్థోమత బట్టి బంగారం కొనుగోలు చేయడం మంచిది.’ అని సాలూరు గోల్డ్ అండ్ సిల్వర్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు సుతాపల్లి వీరవెంకటరావు తెలిపారు.