Share News

పార్వతీపురంలో ఫొటోషూట్‌కు వెళుతూ..

ABN , Publish Date - Oct 16 , 2025 | 12:18 AM

బూర్జ మండలం నీలంపేట జంక్షన్‌ వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కె.సంతోష్‌ (19) మృతి చెందినట్టు బూర్జ పోలీసులు తెలిపారు.

పార్వతీపురంలో ఫొటోషూట్‌కు వెళుతూ..

  • రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ఆమదాలవలస, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): బూర్జ మండలం నీలంపేట జంక్షన్‌ వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కె.సంతోష్‌ (19) మృతి చెందినట్టు బూర్జ పోలీసులు తెలిపారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. విజయనగరం జిల్లా గరివిడి మండలం పేరిపేట గ్రామానికి చెందిన సంతోష్‌ తన స్నేహితుడు, గాజువాకకు చెందిన నమ్మి కనకరాజుతో కలిసి ద్విచక్ర వాహనంపై శ్రీకాకుళం నుంచి పార్వతీపురం వెళుతున్నాడు. ఫొటోగ్రాఫర్లు అయిన వీరు పార్వతీపురంలో ఓ ఫొటోషూట్‌ కోసం వెళ్తుండగా.. నీలంపేట జంక్షన్‌ వద్ద ప్రధాన రహదారిలో ఉన్న గోతులు తప్పించబోయి బైక్‌ అదుపు తప్పి పడిపోయారు. ద్విచక్ర వాహనం నడుపుతున్న సంతోష్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. వెనుక కూర్చున్న కనకరాజుకు తీవ్రంగా గాయపడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Oct 16 , 2025 | 12:18 AM