Share News

పరామర్శకు వెళ్లి వస్తూ అనంతలోకాలకు..

ABN , Publish Date - Sep 27 , 2025 | 12:15 AM

తాలాడ గ్రామంలో బంధువుల పరామర్శకు వచ్చిన ఓ మహిళ బస్సు ఢీకొన్న ఘటనలో మృతిచెందింది.

పరామర్శకు వెళ్లి వస్తూ అనంతలోకాలకు..

భామిని, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): తాలాడ గ్రామంలో బంధువుల పరామర్శకు వచ్చిన ఓ మహిళ బస్సు ఢీకొన్న ఘటనలో మృతిచెందింది. పోలీ సులు అందించిన వివరాల మేరకు.. ఒడిశా రాష్ట్రంలోని కొదమ గ్రామానికి చెందిన కోన మహాలక్ష్మి(68) శుక్రవారం తాలాడ వచ్చింది. తన బంధువుల్లో ఒకరు చనిపోతే పరామర్శించేందుకు వచ్చింది. తిరిగి తన స్వగ్రామం వెళ్లేందు కు అత్తి కొత్తూరు సెంటర్‌లో బస్సు కోసం ఆమె నిరీక్షించింది. బస్సు రాగానే వెంటనే ముందుకు వెళ్లింది. దాంతో బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బత్తిలి హెచ్‌సీ సంగమేశ్వరరావు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Updated Date - Sep 27 , 2025 | 12:15 AM