Share News

Goa Governor arrives in Vizianagaram గోవా గవర్నర్‌ అశోక్‌గజపతిరాజు విజయనగరం రాక

ABN , Publish Date - Sep 01 , 2025 | 12:25 AM

Goa Governor arrives in Vizianagaram గోవా గవర్నర్‌ పూసపాటి అశోక్‌గజపతిరాజు ఆదివారం విజయనగరం చేరుకున్నారు. గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా విజయనగరం వచ్చారు. మధ్యాహ్నం 3.30గంటలకు ఆయన విశాఖపట్నం నుంచి రోడ్డుమార్గంలో విజయనగరంలోని తన నివాసానికి చేరుకున్నారు. ఆయన వెంట సతీమణి సునీలా గజపతిరాజు ఉన్నారు.

Goa Governor arrives in Vizianagaram గోవా గవర్నర్‌ అశోక్‌గజపతిరాజు విజయనగరం రాక
పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న అశోక్‌ గజపతిరాజు

గోవా గవర్నర్‌ అశోక్‌గజపతిరాజు విజయనగరం రాక

పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరణ

విజయనగరం/రూరల్‌, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): గోవా గవర్నర్‌ పూసపాటి అశోక్‌గజపతిరాజు ఆదివారం విజయనగరం చేరుకున్నారు. గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా విజయనగరం వచ్చారు. మధ్యాహ్నం 3.30గంటలకు ఆయన విశాఖపట్నం నుంచి రోడ్డుమార్గంలో విజయనగరంలోని తన నివాసానికి చేరుకున్నారు. ఆయన వెంట సతీమణి సునీలా గజపతిరాజు ఉన్నారు. ఇక్కడకు చేరాక తొలుత పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, సువ్వాడ రవిశేఖర్‌, ఆకిరి ప్రసాదరావు, ప్రసాదుల ప్రసాద్‌, బొద్దల నర్సింగరావు, ఆల్తి బంగారుబాబు, అవనాపు విజయ్‌ తదితర టీడీపీ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అశోక్‌ నివాసానికి వచ్చి కొద్దిసేపు మాట్లాడారు. విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, ఇన్‌చార్జి ఆర్‌డీవో మురళీ కూడా అశోక్‌ను కలిశారు.

నేడు పైడిమాంబను దర్శించుకోనున్న అశోక్‌గజపతిరాజు

విజయనగరం పర్యటనలో ఉన్న గోవా గవర్నర్‌ అశోక్‌గజపతిరాజు సోమవారం ఉదయం 11 గంటలకు మూడులాంతర్ల వద్దనున్న పైడిమాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. గవర్నర్‌ హోదాలో ఆలయానికి వస్తున్న నేపథ్యంలో దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌, పైడిమాంబ దేవస్థానం ఈవో శిరీష, ఆలయ సిబ్బంది, అర్చకులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలకనున్నారు.

Updated Date - Sep 01 , 2025 | 12:25 AM