Share News

field visits క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లండి

ABN , Publish Date - Apr 07 , 2025 | 11:27 PM

Go for field visits ఇకపై మండల ప్రత్యేకాధికారులు ప్రతి శుక్రవారం క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ ఆదేశించారు. అక్క నుంచే వీడియో సమావేశంలో పాల్గొనాలని స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు.

 field visits క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లండి
కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌

పార్వతీపురం, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): ఇకపై మండల ప్రత్యేకాధికారులు ప్రతి శుక్రవారం క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ ఆదేశించారు. అక్క నుంచే వీడియో సమావేశంలో పాల్గొనాలని స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. క్షేత్రస్థాయి సమస్యలపై మండలాల ప్రత్యేక అధికారులకు పూర్తిస్థాయి అవగాహన ఉండాలన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం కొన్ని మండలాల్లో అధికారులను మార్పు చేసినట్టు తెలిపారు. ఇకపై మండలాల్లో పర్యవేక్షించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఎంఎస్‌వోల వద్ద పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచాలన్నారు.

తాగునీటి సమస్య తలెత్తరాదు

జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తరాదని కలెక్టర్‌ ఆదేశించారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీర్లు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గ్రామాల్లో తాగునీటికి అంతరాయం కలగకూడదని చెప్పారు. పంచాయతీ పరిధిల సమస్యలను ఎంపీడీవోల దృష్టికి తీసుకురావాలని కార్యదర్శులకు సూచించారు. మండల పరిషత్‌ నిధులు నుంచి మోటార్లను కొనుగోలు చేసి నీటి సరఫరా చేయాలన్నారు. పాచిపెంట మండలం ములగపాడు, కందివలస, కాకులమడ గ్రామాల్లో నీరు కలుషితమై ప్రజలు రోగాలపాలవడంపై కలెక్టర్‌ మండిపడ్డారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కరించాలన్నారు. అవసరమైతే తాత్కాలికంగా 20 లీటర్ల తాగునీటి క్యాన్లను అందించాలన్నారు.

Updated Date - Apr 07 , 2025 | 11:27 PM