Share News

నిరసన దీక్షకు అనుమతి ఇవ్వండి

ABN , Publish Date - Jul 16 , 2025 | 12:04 AM

నిరసన దీక్షకు అనుమతి ఇవ్వాలని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు కోరారు.

నిరసన దీక్షకు అనుమతి ఇవ్వండి

శృంగవరపుకోట రూరల్‌, జూలై 15(ఆంధ్రజ్యోతి): జిం దాల్‌ యాజమాన్యం నుంచి రావాల్సిన హక్కుల కోసం హరిజన, గిరిజన నిర్వాసిత రైతులు శాంతియుతంగా పోరాటం చేస్తుంటే వారిపై పలు శాఖల అధికారులు అణిచివేత ధోరణి అవలంభిస్తున్నాయని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అన్నారు. ఈ మేరకు అమరావతిలో జాతీయ షెడ్యూల్‌ కులాల కమిషన్‌ సభ్యు డు వడ్డేపల్లి శ్యాంసుందర్‌ను కలిసి, సమస్యను వివరిం చారు. 2008 జిందాల్‌ భూముల సేకరణ నుంచి నేటివ రకు జరుగుతున్న పరిస్థితులు, నిర్వాసితులకు రావాల్సిన న్యాయపరమైన హామీలతో పాటు వారిపై పోలీస్‌శాఖ బెదిరింపులు, ఇతర అధికారులు భయబ్రాంతులకు గురిచేయడం వంటి అంశాలను ఆధారాలతో ఆయనకు నివేదిక అందించారు. అదేవిధంగా రాజ్యాంగ హక్కుల ప్రకారం నిర్వాసితులకు నిరసన దీక్షకు అనుమతులు ఇప్పించాలని కోరారు. దీనిపై కమిషన్‌ సభ్యుడు సానుకూలంగా స్పందించినట్టు ఆయన తెలిపారు.

పోలీసులకు దరఖాస్తు

శృంగవరపుకోట, జూలై 15(ఆంధ్రజ్యోతి): నిరసన దీక్షకు అనుమతి ఇవ్వాలని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మంగళవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఏఎస్‌ఐ రమణకు దరఖాస్తు అందించారు. తాను జిందాల్‌ బాధితుడినని, తన భూములు పరిశ్రమకు ఇచ్చామని, అయితే 18 ఏళ్లు అయినా పరిశ్రమ రాలేదని దీని కోసం ఇప్పటికే జిందాల్‌ నిర్వాసితులు 24రోజులుగా పోరాటం చేస్తున్నారని తెలిపారు. తమకు నిరసన దీక్ష చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం సెక్షన్‌ 30 అమల్లో ఉందని సీఐ చెప్పడంతో, దీనిని అనుసరించి తమ శాంతియుత నిరసన దీక్షకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు.

Updated Date - Jul 16 , 2025 | 12:04 AM