Give exact details కచ్చితమైన వివరాలివ్వాలి
ABN , Publish Date - Dec 04 , 2025 | 11:46 PM
Give exact details అధికారులు కచ్చితమైన వివరాలతో నివేదికలు అందజేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం జిల్లా సమీక్ష సమావేశం (డీఆర్‌సీ) జరిగింది. సంక్షేమ ఫలాలు, వ్యవసాయం, ఉద్యానం, విద్య, ధాన్యం కొనుగోళ్లు, నీటి పారుదల, రెవెన్యూ, గృహనిర్మాణం, మహిళా శిశు సంక్షేమం తదితర అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రాజెక్టులు, నీటి పారుదలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించాల్సిన అవసరం ఉందని, ఇరిగేషన్‌పై ప్రజాప్రతినిధులు, అధికారులతో పది రోజుల్లో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
కచ్చితమైన వివరాలివ్వాలి
అదనంగా ధాన్యం తీసుకుంటే కఠిన చర్యలు
డీఆర్‌సీ సమావేశంలో ఇన్‌చార్జి మంత్రి అనిత
విజయనగరం, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): అధికారులు కచ్చితమైన వివరాలతో నివేదికలు అందజేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం జిల్లా సమీక్ష సమావేశం (డీఆర్‌సీ) జరిగింది. సంక్షేమ ఫలాలు, వ్యవసాయం, ఉద్యానం, విద్య, ధాన్యం కొనుగోళ్లు, నీటి పారుదల, రెవెన్యూ, గృహనిర్మాణం, మహిళా శిశు సంక్షేమం తదితర అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రాజెక్టులు, నీటి పారుదలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించాల్సిన అవసరం ఉందని, ఇరిగేషన్‌పై ప్రజాప్రతినిధులు, అధికారులతో పది రోజుల్లో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. ధాన్యం కొనుగోలుపై చర్చ సందర్భంగా మంత్రి అనిత స్పందిస్తూ మిల్లర్లు అదనంగా ఐదు కిలోల వరకూ రైతుల నుంచి ధాన్యం తీసుకుంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఏ మిల్లర్ అయినా రైతుల నుంచి అదనంగా ధాన్యం తీసుకుంటే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, చెరుకు రైతుల సమస్యలపై చర్చించేందుకు, మద్దతు ధర కల్పనకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశం పెట్టకుండా మద్దతు ధర ఎలా ప్రకటిస్తారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారన్నారు. అనంతరం కలెక్టర్ రామసుందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం మంచి పోషకాహారం సరఫరా చేస్తున్నా మాతృ, శిశు మరణాలు జరగడం బాధాకరమన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీలు డాక్టరు పీవీవీ సూర్యనారాయణ, ఇందుకూరి రఘురాజు, కావలి గ్రీష్మ, ఎమ్మెల్యేలు కోండ్రు మురళీమోహన్, బేబీనాయన, లోకం నాగమాధవి, పి.అదితిగజపతిరాజు, డీసీసీబీ చైర్మన్ నాగార్జున, బుడా చైర్మన్ తెంటు లక్ష్ముంనాయుడు తదితరులు తమ, తమ నియోజకవర్గాల సమస్యలను ప్రస్తావించారు.
స్క్రబ్ టైఫస్ కేసులు లేవు : మంత్రి అనిత
జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసలు లేవని ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత చెప్పారు. డీఆర్‌సీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. స్క్రబ్ టైఫస్‌పై ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. మహాకవి గురజాడ ఇంటిపై దుండగుల దాడిని ఖండించారు. ఆ ప్రాంతంలో నిఘా పెంచడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.