Share News

తహసీల్దార్ల వద్ద ఉన్నఅర్జీలపై నివేదిక ఇవ్వండి

ABN , Publish Date - Nov 17 , 2025 | 11:49 PM

తహసీల్దార్ల వద్ద ఉన్న అర్జీలను మండల ప్రత్యేకాధికారులు సమీక్షించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ రామ సుందర్‌ రెడ్డి ఆదేశించారు. ఉద్యోగులు సచివాలయాల్లో ఉండడంలేదని, ఈ విష యంపై తనిఖీచేయాలని పేర్కొన్నారు. సోమవారం రాత్రి కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో పీజీఆర్‌ఎస్‌ వినతులపై సమీక్షించారు.

తహసీల్దార్ల వద్ద ఉన్నఅర్జీలపై నివేదిక ఇవ్వండి
మాట్లాడుతున్న రామసుందర్‌ రెడ్డి

విజయనగరం కలెక్టరేట్‌ నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): తహసీల్దార్ల వద్ద ఉన్న అర్జీలను మండల ప్రత్యేకాధికారులు సమీక్షించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ రామ సుందర్‌ రెడ్డి ఆదేశించారు. ఉద్యోగులు సచివాలయాల్లో ఉండడంలేదని, ఈ విష యంపై తనిఖీచేయాలని పేర్కొన్నారు. సోమవారం రాత్రి కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో పీజీఆర్‌ఎస్‌ వినతులపై సమీక్షించారు.అనంతరం ఆయన మాట్లాడు తూ మండల ప్రత్యేకాధికారులు వారానికి నాలుగు సచివాలయాలు సందర్శించాలని సూచించారు. అర్జీదారు సమస్యను పూర్తిగా అర్ధం చేసుకోవా లని, వారు చెప్పే విషయాన్ని ఒప్పిగ్గా వినాలని అప్పుడే వారికి సంతృప్తి కలుగుతుందని చెప్పారు. వినతులపై స్వయంగా సంబందించి అధికారే ఎండార్స్‌మెంట్‌ చేయాలని, కింది స్థాయి అధికారులకు అప్పగించకూడదని చెప్పారు. ప్రీఆడిట్‌లో ప్రవర్తనాపరమైన లోపాల పద్ధతిని అనుసరించే విధానంపై కలెక్టరేట్‌ కాల్‌సెంటర్‌ నుంచి ఆడిట్‌ టీమ్‌ అర్జీదారులతో మాట్లాడి పోన్‌ ద్వారా తెలుసుకోనున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఆర్వో శ్రీనివాసమూర్తి, డిప్యూటీ కలెక్టర్‌ మురళి పాల్గొన్నారు.

Updated Date - Nov 17 , 2025 | 11:52 PM