చికిత్స పొందుతూ బాలిక మృతి
ABN , Publish Date - Sep 07 , 2025 | 11:57 PM
గర్భం దాల్చిన ఓ బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది.
చీపురుపల్లి, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): గర్భం దాల్చిన ఓ బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. మండలానికి చెందిన ఓ బాలిక, పక్క మండలం లోని బాలునితో ప్రేమలో పడింది. తొమ్మిదో తరగతి చదువుతున్న వీరు ఒకరి నొకరు ప్రేమించుకున్నారు. ఈ నేపథ్యంలో బాలిక గర్భం దాల్చింది. ఫిట్స్ రావడంతో ఆమెను విశాఖలోని కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ బాలిక గర్భం లోని పిండాన్ని తొలగించడానికి శస్త్ర చికిత్స చేసే క్రమంలో ఆమె మృతి చెందిం ది. పోలీసులు పోక్సో సెక్షన్ కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.