ఉచిత న్యాయ సేవలు పొందాలి
ABN , Publish Date - Nov 17 , 2025 | 12:50 AM
ప్రజలు ఉచితంగా న్యాయ సేవలు పొందాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి ఎం.బబిత అన్నారు.
- జిల్లా ప్రధాన న్యాయాధికారి బబిత
భోగాపురం, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): ప్రజలు ఉచితంగా న్యాయ సేవలు పొందాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి ఎం.బబిత అన్నారు. నందిగాం గ్రామంలో ఆదివారం నిర్వహించిన న్యాయ సలహా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆర్థిక స్థోమత లేని ప్రజలు ఉచిత న్యాయ సలహాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. చిన్న చిన్న విషయాలకు తగాదాలకు పోకూడదన్నారు. సీనియర్ సిటిజన్స్ ఉచిత న్యాయసేవలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కక్షిదారులు కేసులు రాజీపరచుకునే విధంగా అవగాహన పొందాలన్నారు. చట్టం, శిక్షలు, తదితర వాటిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో న్యాయాధి కారులు, సీఐ దుర్గాప్రసాదరావు, ఎస్‌ఐ పాపారావు పాల్గొన్నారు.